నిద్రించే సమయంలో తల ఆ దిక్కుకే ఎందుకు పెట్టాలో తెలుసా..?
మనకు ఎనిమిది దిక్కులు ఉంటాయి. వాటిని అష్టదిక్కులు అంటాం. వాటాని పాలించే వారిని దిక్పాలకులు అంటారు.
దిశ, వెబ్‌డెస్క్ : మనకు ఎనిమిది దిక్కులు ఉంటాయి. వాటిని అష్టదిక్కులు అంటాం. వాటాని పాలించే వారిని దిక్పాలకులు అంటారు. తూర్పున సూర్యుడు ఉదయించటంతో రోజు మొదలవుతుంది. తూర్పు దిక్కును పాలించేవాడు ఇంద్రుడు. నాలుగు దిక్కులలో తూర్పు దిక్కు ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. భూమి చుట్టూ దక్షిణం నుండి ఉత్తరానికి, తూర్పు నుండి పడమటకి అయస్కాంత శక్తులు పరిభ్రమిస్తూ ఉంటాయి. తూర్పు నుండి పడమటి వైపు ప్రవహించే శక్తి మన శరీరానికి ఎక్కువ ఆరోగ్యమైనది. సూర్యుడు గ్రహాలు నక్షత్రాలు వాటి అయస్కాంత శక్తులను భూమిపైకి నిరంతరం ప్రసరింప చేస్తూ భూమిపై జీవుల జీవనానికి అనుకూలతను చేకూర్చుతాడు. ఆ శక్తి తరంగాలు ఋతువుల మార్పుకు, భూమి సారాన్ని కాపాడుటకు వృక్ష జంతుజాలాన్ని కాపాడుటకు దోహదం చేస్తాయి.
అందుకే తూర్పు దిక్కుగా తల ఉంచి నిద్రించటం శ్రేష్టమని శాస్త్రాలలో చెప్పబడింది. అలాగే దేవుడి ఆరాధనాలో శుభ కార్యక్రమంలో దీపాన్ని తూర్పు వత్తిని వెలిగించాలి. అలాగే ఇంటి ముఖ ద్వారం తూర్పు దిక్కున ఉండుట శుభం. ఏ శుభకార్యం అయిన తూర్పు ముఖంగానే చేయుట మంచిది. భారతదేశంలో ప్రవహించే ప్రధాన నదులు తూర్పు వైపునకు ప్రవహిస్తున్నాయి.