మహిళలు ఎరుపు రంగు బొట్టే ఎందుకు పెట్టుకోవాలో తెలుసా?
మహిళలు చూడటానికి అందంగా కనిపిస్తారు. మరీ ముఖ్యంగా నుదుట బొట్టు ఉంటే ఇక వారి సౌందర్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక మన హిందూ సంప్రదాయం ప్రకార
దిశ, వెబ్‌డెస్క్ : మహిళలు చూడటానికి అందంగా కనిపిస్తారు. మరీ ముఖ్యంగా నుదుట బొట్టు ఉంటే ఇక వారి సౌందర్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక మన హిందూ సంప్రదాయం ప్రకార మహిళలు తప్పనిసరిగా బొట్టుకోవాలి. మరీ ముఖ్యంగా ముత్తైదవులు తిలకం తప్పనిసరిగా పెట్టుకోవాలంటారు. అయితే ఈ బొట్టు పెట్టుకోవడం వలన అందంగా కనిపించడమే కాకుండా.. ఆరోగ్యానికి ప్రయోజనకరమే. కుంకుమ బొట్టు పెట్టుకుంటే.. దాని ద్వారా సూర్యకిరణాలు శరీరమంతా ప్రసరించి.. నూతనోత్తేజాన్నిస్తాయంటారు.
అయితే బొట్టు ఎవరైనా సరే ఎరుపు రంగులోనే పెట్టుకుంటారు. కాగా, బొట్టును ఎరుపు రంగులోనే ఎందుకు పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం.. బొట్టు అంటే ఎరుపు రంగుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఎందుకంటే.. చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు. అందుకే బ్రహ్మస్థానమైన నుదుటిపై ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవడం మన సాంప్రదాయం. అంతే కాకుండా మనుషుల ఆత్మ జ్యోతి స్వరూపమని,అందుకే ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవాలని సూచిస్తారు.
Also Read..