టూత్‌పేస్ట్ పై ఈ రంగుల మార్క్ ఎందుకు వేస్తారో తెలుసా?

ఈ డైలీ లైఫ్ లో మనం నిత్యం చేసే పనులలో మార్నింగ్ లేవగానే బ్రష్ తో దంతాలను శుభ్రం చేసుకోవడం ఒకటి. అయితే ఈ క్రమంలో ఏ టూత్ పేస్ట్ యూజ్ చేయాలో అనే సందేహాలు కూడ వస్తాయి.

Update: 2024-02-21 15:29 GMT

 దిశ, వెబ్ డెస్క్: ఈ డైలీ లైఫ్ లో మనం నిత్యం చేసే పనులలో మార్నింగ్ లేవగానే బ్రష్ తో దంతాలను శుభ్రం చేసుకోవడం ఒకటి. అయితే ఈ క్రమంలో ఏ టూత్ పేస్ట్ యూజ్ చేయాలో అనే సందేహాలు కూడ వస్తాయి. మనం రోజూ ఉదయం నిద్ర లేవగానే టూత్‌పేస్ట్‌ వాడుతుంటాం. అయితే దీనికి సంబంధించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. మెరిసే దంతాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఈ విధంగా మనం ఉపయోగించే టూత్ పేస్ట్లు ఎన్నో రకాలుగా ఉంటాయి. అయితే వాటిపై కొన్ని గుర్తులు ఉండడం గమనించారా? కోల్ గేట్ వాడేవారు ఒకసారి ఆ పేస్ట్ పై ఉండే రంగుల గుర్తులను గమనించండి. ఆ గుర్తులు ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకోవాలనుకుంటున్నారా! అయితే ఇది చదవండి..

టూత్‌పేస్ట్ తీసుకునేటప్పుడు, పేస్ట్ యొక్క ట్యూబ్ క్రింది భాగంలో వివిధ రంగులను చాలా మంది చూసే ఉంటారు. కానీ కొందరు వాటిని పట్టించుకోని ఉండరు. కానీ చాలా మందికి అవి ఎందుకు రకరకాల కలర్స్ లో ఉన్నాయనే సందేహాలు ఉన్నాయి. అందుకే ఈ గుర్తులను ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుందాం.. అన్ని రంగులకు వేర్వేరు అర్థాలు ఉన్నాయి. టూత్‌పేస్ట్ లో దానిపై ఉండే ఎరుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగులు ప్రత్యేక అర్థాలు ఉన్నాయి. అయితే వీటి గురించి తెలియకుండా తీసుకుంటే ఇబ్బంది తప్పదంటున్నారు నిపుణులు.. ఎందకంటే. ఈ ఆధునిక యుగంలో మొత్తం టెక్నాలజీ పై ఆధారపడి ఉన్నాం. నిత్యం ఎన్నో కొత్త విషయాలు మన దృష్టికి వస్తున్నాయి. కానీ ప్రతిదీ తెలుసుకోవడం సాధ్యం కాదు. అందుకే చాలా మంది వ్యక్తులు గూగుల్ ని సందర్శిస్తారు.

టూత్‌పేస్ట్ ట్యూబ్‌పై నీలిరంగు గీత అర్థం మెడికేటెడ్ టూత్‌పేస్ట్. ఆకుపచ్చ రంగు ఇది పూర్తిగా సహజమని అర్థం. రెడ్ స్ట్రిప్ స్టెయిన్ అంటే నేచురల్ అండ్ కెమికల్ మిశ్రమం, బ్లాక్ స్ట్రిప్ అంటే ఫుల్ కెమికల్ అని అర్థం కానీ ఇది ఎంతవరకు నిజమో కానీ బ్లాక్ కలర్ టూత్‌పేస్ట్‌లో ఎక్కువ రసాయనాలు ఉంటాయంటారు. అందుకే వాటిని వాడకూడదని కూడా ప్రచారం జరిగింది. అదేవిధంగా ఎరుపు చారల టూత్‌పేస్ట్‌లో రసాయనాలు ఉన్నాయని చెబుతారు, అయితే నలుపు కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. గతంలో ఇంటర్నెట్‌లో నీలం, ఆకుపచ్చ చారలతో టూత్‌పేస్ట్‌ను మాత్రమే ఉపయోగించమని వార్తలు కూడా వచ్చాయి.

సైంటిఫిక్ టూత్‌పేస్ట్ ట్యూబ్‌పై వివిధ కలర్స్ తో చారలు ఉంటాయి. వాటి గురించి అసలు నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రపంచంలో మనం నిత్యం యూజ్ చేస్తున్నా ప్రతిదీ సాంకేతికంగా రసాయనికమైనది. సహజమైన వస్తువులు కూడా ఉంటాయి. కానీ నేచురల్ వాటిలో కొన్ని వస్తువులలో రసాయనాలు ఉంటాయి అనడంలో ఆశ్చర్యం లేదు. అటువంటి పరిస్థితిలో టూత్‌పేస్ట్ తయారీ సంస్థ కోల్‌గేట్ తన వెబ్‌సైట్‌లో ఏదైనా టూత్‌పేస్ట్ తయారీలో సహజ లేదా రసాయన పదార్థాలను విడిగా ఉపయోగించలేదని పేర్కొంది. ఏ రకం పరిమాణంలో ట్యూబ్ తయారు చేయాలో సూచిస్తుంది. కాంతి సెన్సార్లు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలవు మనుషులు కాదు. ట్యూబ్‌లో పేస్ట్ ఎంత దూరం నింపబడుతుందో సూచించడానికి వివిధ రంగులు ఉపయోగించబడతాయి. ఆ రంగును చూడటం ద్వారా ట్యూబ్‌లోని ఏ భాగాన్ని సీల్ చేయాలో యంత్రానికి తెలుస్తుంది. ఇది ప్యాకేజింగ్ పనిని సులభతరం చేస్తుంది. ఈ రంగులు అనేవి ఉత్పత్తి సంస్థ మాత్రమే ఉపయోగపడతాయి.


Similar News