టైర్స్ నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా?

కొన్ని విషయాలు తెలుసుకుంటే వావ్ ఇలా కూడా ఉంటాయా అనిపిస్తుంటుంది.ఇక సోషల్ మీడియా వచ్చాక మనకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాం. ఇక మనం ఎప్పుడూ బయటకు వెళ్లినా,

Update: 2024-02-13 15:20 GMT

దిశ, ఫీచర్స్ : కొన్ని విషయాలు తెలుసుకుంటే వావ్ ఇలా కూడా ఉంటాయా అనిపిస్తుంటుంది.ఇక సోషల్ మీడియా వచ్చాక మనకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాం. ఇక మనం ఎప్పుడూ బయటకు వెళ్లినా, లేదా ఏదైనా ఊరు వెళ్లాలన్నా, మార్కెట్‌కు వెళ్లినా మనకు ఎక్కువగా వాహనాలు కనిపిస్తుంటాయి. అయితే అన్ని వాహనాలకు ఉండే టైర్స్ నలుపు రంగులో మాత్రమే కనిపిస్తుంటాయి. చివరకు మన ఇంట్లో ఉండే టూవీలర్ టైర్స్ కూడా బ్లాక్ కలర్‌లోనే ఉంటాయి. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వాహనాల టైర్స్ నలుపు రంగులో ఎందుకు ఉంటాయి. అలా ఉండటానికి గల అసలు కారణం ఏమిటి? ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.

మొదటి టైర్ 1895 లో సృష్టించారు.అయితే అప్పుడు టైర్స్‌ను తెలుపు రంగులో తయారు చేశారంట. కానీ అవి ఎక్కువ మన్నికగా లేకపోవడం, అంతే కాకుండా అవి వేడిని కూడ తట్టుకోలేక పోవడం,తెల్లటి టైర్లకు రోడ్డును గ్రిప్ చేసే సామర్థ్యం కూడా లేకపోవడంతో, వాటి స్థానంలో నల్లటి టైర్స్‌ను తయారు చేశారంట. అవి తెలుపు రంగు టైర్స్ కంటే చాలా బెటర్‌గా అనిపించాయంట. టైర్స్ మంచిగా పని చేయడానికి కార్బన్ బ్లాక్ రసాయన సమ్మేళనాన్ని స్వచ్ఛమైన రబ్బరును కలిపారంట. అందువలన ఇవి నలుపు రంగులో ఉంటాయంట. అలాగే, నలుపు రంగు అనేది టైర్స్ త్వరగా దెబ్బతినకుండా ఉండేలా చేస్తుందంట. అందుకే నలుపు రంగు టైర్స్ తయారు చేసేవారంట.

Tags:    

Similar News