ప్రేమ గుడ్డిది అని ఎందుకు అంటారో తెలుసా?

ప్రేమ, ఇది ఎక్కడ ఎలా ఎవరితో మొదలవుతుందో చెప్పలేం. కొంత మందిని చూడగానే, మనలో మనకే తెలియకుండానే ప్రేమ మొదలవుతుంది. ఏదైనా పెళ్లి, పార్టీ, ఫంక్షన్‌లో మన మనసుకు నచ్చిన వ్యక్తి కనబడగానే

Update: 2024-02-01 03:30 GMT

దిశ, ఫీచర్స్ : ప్రేమ, ఇది ఎక్కడ ఎలా ఎవరితో మొదలవుతుందో చెప్పలేం. కొంత మందిని చూడగానే, మనలో మనకే తెలియకుండానే ప్రేమ మొదలవుతుంది. ఏదైనా పెళ్లి, పార్టీ, ఫంక్షన్‌లో మన మనసుకు నచ్చిన వ్యక్తి కనబడగానే మనలో తెలియని ఓ ఆకర్షణ మొదలవుతుంది. తన కోసమే నేను పుట్టానేమో అనే కోరిక కలుగుతుంది. దానినే ప్రేమ అంటారు.

అయితే ఈ ప్రేమ అనేది మనిషి అందంతోనే కాదు, వారి మాట విధానం, వారి మంచి మనసు ఇలా చాలా అంశాలను బట్టి ప్రేమ పుడుతుంది. ఇలా ప్రేమలో పడిన యవతీ, యువకులు ఎందరో ఉన్నారు.మనం కొత్త మంది లవర్స్‌ను, తమ ప్రేమ ఎక్కడ పుట్టింది? ఎలా మొదలైందని అడిగితే వారు ఏం సమాధానం చెప్పలేరు.ఎందుకంటే ప్రత్యేకించి ఒక లక్షణానికి వారు బందీ అవరు. అసలు నేను ఎందకు ప్రేమలో పడ్డాను? ఎందుకు ఈ అమ్మాయి లేదా అబ్బాయిని ఇష్టపడ్డాను అని వారికి వారే ప్రశ్నించుకుంటారు. అందుకే ప్రేమ గుడ్డిది అని అంటారంట. 


Similar News