వర్షం పడినప్పుడు ఆకాశంలో మెరుపులు ఎందుకు వస్తాయో తెలుసా?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని చోట్ల చిరుజల్లులు పడుతుంటే, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. అయితే వర్షం పడినప్పుడు మెరుపులు రావడం

Update: 2024-07-26 16:49 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని చోట్ల చిరుజల్లులు పడుతుంటే, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. అయితే వర్షం పడినప్పుడు మెరుపులు రావడం అనేది సహజం. చాలా మంది మెరుపును చూసి భయపడి పోతుంటారు. పిడుగు వేస్తుందేమో భయాందోళనకు గురి అవుతారు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వర్షం పడే సమయంలో మాత్రమే ఎందుకు మెరుపులు వస్తాయి. అసలు మెరుపులు రావడానికి గల అసలు కారణం ఏమిటి అని. కాగా, ప్రస్తుతం దాని గురించే తెలుసుకుందాం.

అయితే వర్షం పడే సమయంలో మెరుపులు రావడానికి మేఘాలు కారణం అంట. అయస్కాంతంలో బుణావేశ ధృవం, ధనావేశ ధృవం ఉంటాయి. ఇవి రెండు వ్యతిరేక ఆవేశ ధృవాలు. అయితే ఆ రెండు వ్యతిరేఖ ధృవాలు ఎలా ఆకర్షించుకుంటాయో, ఆకాశంలోని మేఘాలు కూడా వర్షం పడే సమయంలో అవి ప్రయాణిస్తూ.. మధ్య మధ్యలో వేగంగా ఢీ కొంటాయంట. దీని వలన మెరుపులు ఏర్పడుతాయంట. ఇలా మెరుపు ఏర్పడినప్పుడు, దాని చుట్టూ,20730 డిగ్రీల సెల్సియస్ టెంప‌రేచ‌ర్ వేడి విడుదల అవుతోంది. ఈ వేడి సూర్యడి దగ్గర ఉండే ఉష్ణోగ్రత కంటే ఐదు రేట్లు ఎక్కువ. ఆ వేడి గాలి ద్వారా ప్రయాణించినప్పుడు, గాలిలోని కణాలు ఢీ కొని ఉరుము లాంటి శబ్ధం వస్తుందంట.

Tags:    

Similar News