ఉల్లిపాయలు తరుగుతుంటే కన్నీళ్లు ఎందుకు వస్తాయో తెలుసా?
సాధారణంగా ఉల్లిపాయలు తరుగుతుంటే కళ్ళు మండుతాయి. కళ్ల వెంట నీరు కారుతుంది. కారణం.. ఉల్లిపాయలలో మన కళ్ళను
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఉల్లిపాయలు తరుగుతుంటే కళ్ళు మండుతాయి. కళ్ల వెంట నీరు కారుతుంది. కారణం.. ఉల్లిపాయలలో మన కళ్ళను మండించే ఒక రసాయన పదార్థం ఉంది. దాని పేరు సిన్-ప్రొపాంథైల్-ఎస్-ఆక్సైడ్. ఈ రసాయనం కళ్లలో ఉండే లాక్రిమల్ గ్రంధిని ప్రేరేపిస్తుంది. ఉల్లిపాయను కోయగానే దానిలో ఉన్న ఈ పదార్థం గాలిలో కలిసి కళ్ళను మండిస్తుంది. వెంటనే మన కళ్ళ నుండి నీరు కారుతుంది. ఇలా కళ్ళల్లో నుంచి నీరు కారణం మంచిదే. ఎందుకంటే గాలిలో ఉన్న దూళి కణాలు మన కంటిలోకి చేరుతాయి. ఆ దూళికణాలు ఆ నీటితో పాటు బయటకు వస్తాయి.
ఇవి కూడా చదవండి:
డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి హానికరం !.. ‘కన్జ్యూమర్ రిపోర్ట్’ అధ్యయనంలో వెల్లడి