శోభనం గదిలోకి వధువు పాల గ్లాస్‌తో ఎందుకు వెళ్తుందో తెలుసా?

పెళ్లి అనేది ఇద్దరి జీవితంలో మరువలేని ఓ తీపి జ్ఞాపకం లాంటింది. రెండు మనసులు ఒకటిగా కలిసి, కష్టనష్టాల్లో పాలు పంచుకుంటారు. ఇక పెళ్లి అనేది, పెళ్లి చూపులతో మొదలై, మెహందీ ఫంక్షన్, హల్దీ,

Update: 2024-03-17 09:32 GMT

దిశ, ఫీచర్స్ : పెళ్లి అనేది ఇద్దరి జీవితంలో మరువలేని ఓ తీపి జ్ఞాపకం లాంటింది. రెండు మనసులు ఒకటిగా కలిసి, కష్టనష్టాల్లో పాలు పంచుకుంటారు. ఇక పెళ్లి అనేది, పెళ్లి చూపులతో మొదలై, మెహందీ ఫంక్షన్, హల్దీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. వీటన్నింటిలో శోభనం కూడా ఒకటి. అయితే శోభనం రోజు, భార్య తన భర్త ఉన్న రూమ్‌కు పాలగ్లాస్‌తో వెల్లడం అనేది కామన్. మనం చాలా సినిమాల్లో ఈ సాంప్రదాయాన్ని చూస్తాము. కాగా, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఫస్ట్ నైట్ రోజు వధువు పాల గ్లాస్‌ను ఎందుకు గదిలోకి తీసుకెళ్లాలని. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.

శోభనం గదిలోకి పాల గ్లాస్ తీసుకెళ్లడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వధూవరుల జీవితంలో మొదటి రాత్రి అనేది ఒక జ్ఞాపకం లాంటింది. పెళ్లైన ప్రతి జంట తమకు త్వరగా సంతానం కలగాలని కోరుకుంటుంది. అయితే మొదటి రాత్రి పాలు తీసుకెళ్లడం ద్వారా పాలు అనేవి పునరుత్పత్తి శక్తిని పెంచడానికి సహాయపడతాయి. పురుషుల్లో స్పెర్మ్ కణాల నాణ్యతను మెరుగు పరుస్తాయి. స్త్రీలలో పాలు గర్భధారణ అవకాశాలను పెంచుతాయి. కాబట్టి పిల్లలు కావాలి అనుకునే భార్యలు తప్పకుండా శోభనం రోజు పాల గ్లాస్ తో వెళ్తారు.అంతే కాకుండా, మొదటిరోజు వధూవరుల కలయిక బాగుండడానికి మానసిక స్థితి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పాలలో ట్రిప్టోఫాన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆందోళన, టెన్షన్ తగ్గించడానికి సహాయపడుతుంది. అందవల్లనే శోభనం రోజు పాలగ్లాస్‌తో వెళ్తారంట.


Similar News