మందు ఎందుకు తాగుతారు?.. మందుబాబుల ఇంట్రెస్టింగ్ థాట్స్ మీకోసం..
ఆల్కహాలిజం.. స్త్రీల కంటే పురుషులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది.
దిశ, ఫీచర్స్: ఆల్కహాలిజం.. స్త్రీల కంటే పురుషులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. దాదాపు రెండు రెట్లు ఎక్కువ మంది పురుషులు దీనితో బాధపడుతున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి. యూఎస్‌లో దాదాపు 7.2% మంది మద్యానికి బానిసై బాధపడుతున్నారని వివరిస్తున్నాయి. కాగా అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రచురించిన DSM-5 ఆల్కహాలిజమ్‌కు సంబంధించిన ముఖ్య లక్షణాలను ఎత్తి చూపింది. ఆల్కహాల్ వినియోగంతో ఎలాంటి రుగ్మతలు ఎదురవుతాయో వివరించింది. .
వరల్డ్ వైడ్ రేజింగ్
యూఎస్‌లో మద్యం వ్యసనం ప్రభావితం చేసే వ్యక్తుల జనాభా భారీగానే ఉంది. ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా మోస్ట్ కిల్లర్‌గా పరిగణించబడుతోంది. ఆల్కహాలిజమ్ నిర్వచనంలో ఎటువంటి ఫ్రీక్వెన్సీ లేదా వాల్యూమ్ చేర్చబడలేదు అనేది ఒక ముఖ్యమైన వ్యత్యాసం. కాగా మద్యపానం జీవితంలో సమస్యగా మారే కొన్ని లక్షణాల గురించి చర్చించారు శాస్త్రవేత్తలు. పానీయం లేకుండా భరించలేకపోవడం వంటివి ఇందులో ఉన్నాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు పనిని కూడా ప్రభావితం చేయగల మందు.. మీ జీవితంలో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్‌పై నెగెటివ్ ఎఫెక్ట్ చూపగలదు.
ప్రమాదకర స్థితులు
విపరీతమైన మద్యపానం వల్ల ప్రజలు ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో తమ నిరోధాలను కోల్పోతారు. మద్యం సేవించి, డ్రైవింగ్ చేయడం వంటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తాగడానికి ఇష్టపడే వారు రోజు తాగే మద్యం కన్నా మరింత ఎక్కువ తాగడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. తమ జీవితంపై కంట్రోల్‌ను కోల్పోతారు. ఎంత ప్రయత్నించినా దాని నుంచి బయటపడలేక బాధపడుతుంటారు. తాము సంతోషంగా ఉండే బంధాలను, ప్రాంతాలను నెమ్మదిగా వదులుకుంటూ ఉంటారు.
డిప్రెషన్.. యాంగ్జయిటీ
పెద్ద మొత్తంలో ఆల్కహాల్ తాగడం మెదడును విషపూరితం చేస్తుంది. అలాంటప్పుడు అధికంగా తాగేవారు మానసిక ఆరోగ్య సమస్యలను అనుభవించడం పెద్ద ఆశ్చర్యం కాదు. మద్యపానం కారణంగా కొందరు వ్యక్తులు నల్లబడిపోతుంటారు. ఇది జరగోబోయే ప్రమాదానికి వార్నింగ్ సైన్ మాత్రమే కాదు మద్యం సదరువ్యక్తిపై విపరీతమైన పట్టును సాధించిందని అర్థం. పొగాకు, ధూమపానం చేసేవారిలో నికోటిన్ సొంత ఆలోచనలను ఎలా అడ్డుకుంటుందో తాగుబోతుల విషయంలో మద్యం కూడా అలాగే వారి ఆలోచనలకు బ్రేక్ వేస్తుంది. పూర్తిగా ఆక్రమించేస్తుంది.
రిలేషన్‌షిప్ డ్యామేజ్
మద్యపానం అతిగా సేవించడం ఇంటికి దూరం చేస్తుంది. బంధాల్లో బీటలు వారేలా చేస్తుంది. బాధ్యతలను నిర్వహించడంలో ఫెయిల్ అవుతున్న తాగుబోతుల జీవితాలు, సంబంధాలను భారీగా దెబ్బతీస్తుంది. శారీరకంగా, మానసికంగా డిస్టర్బ్ అవుతుండటంతో నిద్ర సమస్యలను ఎదుర్కొంటారు. ఇక కొందరిలో కామన్ సింప్టమ్.. హ్యాండ్ షేకింగ్. అసౌకర్యం, ఆందోళన, చెమటలు పట్టడం, ఊపిరి ఆడకపోవడం, విపరీతమైన క్రేవింగ్స్‌తో బాధపడుతుంటారు. కోఆర్డినేషన్ విషయంలో లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అనుభవిస్తారు.
తమ అడిక్షన్ సీక్రెట్‌ను దాచేందుకు నానా అవస్థలు పడుతుంటారు. భాగస్వామికి అనుమానం వచ్చేలా చేస్తుంటారు. ఒక్కోసారి సరిగ్గా మాట్లాడేందుకు కూడా కష్టపడుతుంటారు. దీర్ఘకాలికంగా అదే కంటిన్యూ అయితే నత్తిగా మారిపోతుంది. మొత్తానికి ఇవన్నీ కలిసి తమను తాము అసహ్యించుకునే పరిస్థితికి వచ్చేస్తారు. మానసిక కల్లోలంతో మూడ్ స్వింగ్స్‌కు దారితీస్తుంది. ఓసారి హై మరోసారి లో ఫీల్ అవుతుంటారు.
ఎందుకు అడిక్ట్ అవుతారు?
మద్యం దుర్వినియోగం నైట్ క్లబ్‌లో ఒంటరిగా తాగడంతో ప్రారంభమై.. ఒంటరిగా మార్చేస్తుంది. కుటుంబం, స్నేహితులను దూరం చేస్తుంది. నిరాశ్రయులవుతారు. లివర్ దెబ్బతింటుంది. బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. షార్ట్ టర్మ్ మెమొరీ దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. పూర్తిగా మతిమరుపుతో బాధపడే పరిస్థితికి తీసుకొస్తుంది. అయితే రియాలిటీ నుంచి ఎస్కేప్ అయ్యేందుకు ఇలా మద్యానికి బానిస అవుతారని, ఆల్కహాల్ ఎక్స్‌పరిమెంట్ కూడా అడిక్షన్‌కు కారణమవుతుందని చెప్తున్నారు.
Also Read..