మూవీ టైమ్‌లో పాప్ ‌కార్నే ఎక్కువగా ఎందుకు తింటారో తెలుసా?

థియేటర్లో మూవీ చూడాలంటే ముందుగా గుర్తు వచ్చేది పాప్ కార్న్. థియేటర్స్‌లో ఎన్ని కొత్తరకాల ఫుడ్ ఐటమ్స్,స్నాక్స్ ఉన్నా, సినీ లవర్స్ మాత్రం పాప్ కార్న్ కొనడానికే ఇష్టపడుతారు. ఇక కొంతమందైతే

Update: 2024-01-20 04:43 GMT

దిశ, ఫీచర్స్ : థియేటర్లో మూవీ చూడాలంటే ముందుగా గుర్తు వచ్చేది పాప్ కార్న్. థియేటర్స్‌లో ఎన్ని కొత్తరకాల ఫుడ్ ఐటమ్స్,స్నాక్స్ ఉన్నా, సినీ లవర్స్ మాత్రం పాప్ కార్న్ కొనడానికే ఇష్టపడుతారు. ఇక కొంతమందైతే పాప్ కార్న్ కొనిస్తానంటనే మూవీకి వస్తాను అని డైరెక్ట్‌గా చెప్పాస్తారు. మరి అసలు థియేటర్‌కు మూవీ ఏం సంబంధం ఉంది.

పాప్‌కార్న్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందంట. కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రజలు దీన్నీ ఎంతో ఇష్టంగా తింటున్నారంట. మరీ ముఖ్యంగా చాలామంది సినిమాలు చూసేటప్పుడు ఈ పేలాలను ఎక్కువగా తింటారు. మూవీ వాచింగ్ టైమ్‌లోనే పాప్‌కార్న్ తినడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే?

పాప్ కార్న చౌక ధర కావడమే కాకుండా స్మెల్ చాలా టెమ్టింగ్‌గా ఉంటుందంట. అంతే కాకుండా ఈ స్మెల్ థియేటర్‌లోకి ఆహ్వానించదగినదిగా ఉంచుతుంది. అలాగే పాప్ కార్న ఎంత తిన్నా త్వరగా అయిపోదంట. అదే కాకుండా పాప్ కార్న్ తినడం వల్ల మంచి రుచి దొరకడమే కాదు, మంచి స్పర్శ కూడా లభిస్తుంది. దీన్ని ఒకొక్కటీ తింటూ సినిమా చూస్తుంటే చాలా హాయిగా అనిపిస్తుందంట అందుకే చాలా మంది థియేటర్లో పాప్ కార్న్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారంట. అదే విధంగా థియేటర్ల ఓనర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో వాటి నుంచి బయట పడటానికి పాప్ కార్నే మఖ్యకారణం అయ్యిందంట.

Tags:    

Similar News