పెళ్లైన మహిళలకు ఒడి బియ్యం ఎందుకు పోస్తారో తెలుసా?

మన హిందూ సంప్రదాయం ప్రకారం ఎన్నో ఆచారలు ఉన్నాయి. వాటన్నింటినీ ఇప్పటికీ ఆచరిస్తుంటారు. ఇక పల్లెటూర్లలో మరీ ఎక్కువ ఆచారాలు ఆచరణలో ఉంటాయి.

Update: 2023-03-06 05:05 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మన హిందూ సంప్రదాయం ప్రకారం ఎన్నో ఆచారలు ఉన్నాయి. వాటన్నింటినీ ఇప్పటికీ ఆచరిస్తుంటారు. ఇక పల్లెటూర్లలో మరీ ఎక్కువ ఆచారాలు ఆచరణలో ఉంటాయి.

అయితే మన ఇంట్లో ఆడపిల్లలను మహాలక్ష్మీగా భావిస్తుంటారు. అందుకే ఆమెకు ఏ ఆపదరాకుండా, చూసుకుంటారు. అంతే కాకుండా పెళ్లైన తర్వాత ఆ మహిళకు పుట్టింటికి వచ్చిన తర్వాత ఎన్నో మర్యాదలు చేస్తుంటారు.అందులో ఒడి బియ్యం ఒకటి. తమ ఇంట్లో ఏ చిన్న శుభకార్యం చేసుకున్నా సరే తన బిడ్డకు బియ్యం పోసి, బట్టలు పెట్టే ఆచారం ఉంటుంది.

అయితే బియ్యం పొయ్యడానికి గల అసలు కారణం గురించి పండితులు ఏం చెబుతున్నారంటే..సాధారణంగా మనిషి శరీరంలో ఏడు చక్రాలుంటాయంట. వీటిలో గౌరీదేవి 7 రూపాల్లో నిక్షిప్తమై ఉంటుందంట. అందులో ఒకటి మణిపుర చక్రం నాభి వద్ద ఉంటుంది. ఈ మణిపుర చక్రంలోని మధ్యభాగంలో ఒడ్డియాన పీఠం ఉంటుంది. ఈ ఒడ్డియాన పీఠంలో ఉండే శక్తిని మహాలక్ష్మీగా భావిస్తారు. పెళ్లి జరిగిన తరువాత ఆడపిల్లలకు ఒడి  బియ్యం సమర్పించడం అంటే.. ఒడ్డి యాన పీఠంలో ఉన్న మహాలక్ష్మీ అనే శక్తికి బియ్యం సమర్పించడం అని అర్థం అంట.అలా ప్రతీ పుట్టింటి వారు తమ కూతురు అత్తవారింట్లో అష్టఐశ్వర్యాలతో ఉండాలని ఒడి బియ్యం పోస్తారంట.

ఇవి కూడా చదవండి : ఆప్తుల మరణంతో గుండె బద్ధలైన సందర్భం.. హార్ట్ పనితీరు ఇలా..

Tags:    

Similar News