శుభకార్యాల్లో మామిడాకులే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే ఇంటి గుమ్మానికి మామిడాకు తోరణాలు కడుతుంటాం. అసలు శుభకార్యల్లో మామిడాకులే ఎందుకు కడుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
దిశ, వెబ్‌డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే ఇంటి గుమ్మానికి మామిడాకు తోరణాలు కడుతుంటాం. అసలు శుభకార్యల్లో మామిడాకులే ఎందుకు కడుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మామిడి చెట్టు అనేది భక్తికి ప్రేమకు సంకేతమని భారతీయ పురాణాలు చెబుతాయి. అలాగే మామిడి చెట్టు కోరికలు తీరుస్తుందంటారు.
అంతే కాకుండా మామిడి చెట్టు సృష్టికర్త బ్రహ్మకు అర్పించిన వృక్షం. దీని పువ్వులు చంద్రునికి అర్పించబడ్డాయి. కాళిదాసు ఈ చెట్టును మన్మథుడి పంచబాణాలలో ఒకటిగా వర్ణించడంట. అలాగే శివపార్వతుల కల్యాణం మామిడి చెట్టు కింద జరిగిందనీ, అందుకే శుభకార్యాలలో మామిడి చెట్టు ఆకులను ఉపయోగిస్తున్నారంట. మామిడాకులు ఉపయోగించడం వలన మంచి జరుగుతుందని నమ్మకం.
ఇవి కూడా చదవండి :