సర్జరీ సమయంలో డాక్టర్స్ ఎక్కువగా బ్లూ డ్రెస్‌నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?
మన ముందే జరుగుతున్న ఎన్నో విషయాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. అవునా.. ఇది ఇలా ఎందుకు జరుగుతుంది. అంటూ ఎన్నో డౌట్స్‌ను క్రియేట్ చేస్తుంటాయి.
దిశ, వెబ్‌డెస్క్ : మన ముందే జరుగుతున్న ఎన్నో విషయాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. అవునా.. ఇది ఇలా ఎందుకు జరుగుతుంది. అంటూ ఎన్నో డౌట్స్‌ను క్రియేట్ చేస్తుంటాయి. అయితే ప్రస్తుతం సర్జరీస్ అనేవి యంత్రపరికరాలతో చాలా ఈజీగా జరిగిపోతున్నాయి. ఇక ఏ ఆసుపత్రిలో సర్జరీస్ చేసినా వైద్యులు ఎక్కువగా బ్లూకలర్ డ్రెస్ వేసుకొని కనిపిస్తుంటారు.అసలు వైద్యులు ఆపరషేన్ చేసే సమయంలో ఎక్కువగా నీలంరంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారు అనే ఆలోచన చాలా మందికే వచ్చి ఉంటుంది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.
డాక్టర్లు నీలంరంగు దుస్తులను వేసుకోని సర్జరీ చేయడం వెనుక సైన్స్ ఉన్నదంట. మనం బయట నుంచి చీకటి గదిలోకి వెళ్లే సమయంలో కళ్ల క్లియర్‌గా కనిపించకుండా మసక బారినట్లు కనిపిస్తాయి. అందుకే బ్లూకలర్ డ్రెస్ వేసుకోవడం వలన కాస్త రిలీఫ్‌గా ఉంటుందంట.అలాగే బ్లూకలర్ డ్రెస్ మీద రక్తం మరకలు పడినా అవి గోధుమ రంగులో కనిపిస్తాయి అందుకే ఆ రంగు దుస్తులను వైద్యులు వేసుకుంటారంట.