Human Blood:రక్తం ఎర్రగా ఎందుకు ఉంటుందో తెలుసా?
మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి. అలాగే అవయవానికి ఒక ప్రత్యేకత ఉంటుంది.
దిశ, ఫీచర్స్ : మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి. అలాగే అవయవానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక మన శరీరంలో ఉండే రక్తానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఎవరిని అడిగా రక్తం ఏ రంగులో ఉంటుంది అంటే ఎరుపు రంగు అనే చెప్తుంటారు. అయితే మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు రక్తం ఎరుపు రంగులో మాత్రమే ఎందుకు ఉండాలి తెలుపు లేదా నీలం రంగులో ఉండచ్చు కదా. కానీ రక్తం ఎరుపు రంగులో ఉండటానికి ఓ కారణం ఉన్నదంట. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఒక మనిషి శరీరంలో ఐదు లీటర్ల వరకు రక్తం ఉంటుంది. ఇందులో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్తకణాలు అని రెండు రంగుల కణాలు ఉంటాయి. అయితే మన శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన మన రక్తం రంగు ఎరుపు రంగులో ఉంటుందంట. అంతే కాకుండా మన ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఎక్కువగా ఉండటం, ఆ ప్రోటీన్ ఆక్సిజన్‌తో కలవడం వలన రక్తం రంగు ఎరుపు రంగులోకి మారుతుందంట. అయితే కొంత మంది రంగు నలుపు రంగులో కనిపిస్తుంటుంది. దానికి కారణం ఐరన్ లోపం. ఐరన్ లోపం ఉండటం వలన రక్తం ఎరుపు నుంచి ముదురు ఎరుపు లేదా నలుపు రంగులోకి మారుతుందంట. ( నోట్ : పై సమాచారం నిపుణులు, ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది. దిశ దీనిని ధృవీకరించడం లేదు)