cancer : ఏయే క్యాన్సర్ ను ఏ పరీక్షలతో గుర్తించవచ్చో తెలుసా..
ప్రపంచంలో చాలామంది మరణాలకు ప్రధాన కారణం క్యాన్సర్.
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలో చాలామంది మరణాలకు ప్రధాన కారణం క్యాన్సర్. WHO ప్రకారం భారతదేశంలో లక్షల్లో క్యాన్సర్ తో బాధపడుతూ మరణిస్తున్నారు. కొంతమంది వైద్య నిపుణుల ప్రకారం వివిధ రకాల క్యాన్సర్లను వివిధ పద్ధతుల్లో గుర్తిస్తారని చెబుతున్నారు. మరి ఆ పరీక్షలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రొమ్ము క్యాన్సర్ మామోగ్రఫీ ద్వారా గుర్తిస్తారని వైద్యనిపుణులు చెబుతున్నారు.
గర్భాశయ క్యాన్సర్ ను పాప్ స్మియర్ పరీక్ష ద్వారా గుర్తిస్తారని చెబుతున్నారు. పాప్ స్మియర్ పరీక్షలో గర్భాశయంలో ఉండే క్యాన్సర్ కణాలను ముందుగా గుర్తించవచ్చు.
కొలొనోస్కోపీ ద్వారా లేదా మల పరీక్ష సహాయంతో కొలొరెక్టల్ క్యాన్సర్ ను స్క్రీనింగ్ చేస్తారు.
ఊపిరితిత్తుల క్యాన్సర్ ను డోస్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ (LDCT) ద్వారా CT స్కాన్ ద్వారా ఊపిరితిత్తుల గుర్తిస్తారని చెబుతున్నారు.
ప్రోస్టేట్ క్యాన్సర్ ను PSA రక్త పరీక్ష, డిజిటల్ మల పరీక్ష ద్వారా ముందుగానే గుర్తించేందుకు అవకాశాలు ఉంటాయంటున్నారు.
స్కిన్ క్యాన్సర్ ను మెలనోమా మొదలైనవాటిని చర్మ పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. తద్వారా చికిత్సను సమయానికి ప్రారంభించవచ్చు.
అండాశయ క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించడం చాలా కష్టం. అయితే ట్రాన్స్‌వాజినల్ అల్ట్రాసౌండ్, CA125 రక్త పరీక్ష ద్వారా గుర్తించవచ్చు.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.