Dr Br Ambedkar సార్వత్రిక విశ్వవిద్యాలయంను ఎప్పుడు స్థాపించారో తెలుసా?

దిశ, ఫీచర్స్: 'డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం' 1982 ఆగస్టు 26న స్థాపించబడింది. (పూర్వం ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయముగా పిలవబడేది) దూర విద్యావిధానాన్ని భారతదేశంలో మొదట ప్రవేశపెట్టిన ఘనత ఈ సంస్థదే..Latest Telugu News

Update: 2022-08-26 06:30 GMT

దిశ, ఫీచర్స్: 'డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం' 1982 ఆగస్టు 26న స్థాపించబడింది. (పూర్వం ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయముగా పిలవబడేది) దూర విద్యావిధానాన్ని భారతదేశంలో మొదట ప్రవేశపెట్టిన ఘనత ఈ సంస్థదే. కాగా చదువుకోవాలనే కోరిక వుండి, ఏవైనా కారణాలవల్ల కళాశాలకు వెళ్లలేనివారికి ఉన్నత విద్యావకాశాలను అందించటానికి ఈ విశ్వవిద్యాలయం ప్రారంభించబడింది. దీనికి 218 విద్యాకేంద్రాలు (23 ప్రాంతీయ సమన్వయ కేంద్రాలు, పీజీ కేంద్రాలు) ఉన్నాయి.

ఇంగ్లీషు, తెలుగు మాధ్యమాల్లో చదువుకునే వెసులుబాటుతోపాటు కొన్ని కోర్సులు కేవలం ఇంగ్లీషు మాధ్యమంలో, మరి కొన్ని ఉర్దూ మాధ్యమంలో అందుబాటులో ఉన్నాయి. అలాగే అండర్ గ్రాడ్యుయేట్, పీజీ డిప్లొమా, పీజీలతోపాటు మార్కెటింగ్ నిర్వహణ, వ్యాపార అర్థశాస్త్రం, పరిసరాల విద్య, మానవ హక్కులు, స్త్రీ విద్య.. వంటి వన్ ఇయర్ కోర్సులు కూడా ఉన్నాయి.  

Tags:    

Similar News