ఈ ఏడాదిలో లగ్గానికి మంచిరోజులు.. మోగనున్న పెళ్లి భాజాలు

హిందూ వివాహం ఒక పవిత్ర కార్యం. హిందూ మతంలో ఉన్న విభిన్న సామాజిక వర్గాలు వేరువేరు వివాహ పద్ధతులను ఆచరిస్తారు.

Update: 2024-01-15 05:24 GMT

దిశ, ఫీచర్స్ : హిందూ వివాహం ఒక పవిత్ర కార్యం. హిందూ మతంలో ఉన్న విభిన్న సామాజిక వర్గాలు వేరువేరు వివాహ పద్ధతులను ఆచరిస్తారు. ఎన్ని పద్ధతుల్లో వివాహాలు జరిపినా ముందుగా పెండ్లికి మంచి ముహూర్తాన్ని చూస్తారు. శుభముహూర్తాలు నిర్ణయించి వివాహం జరిపిస్తే ఆ జంట నిండు నూరేళ్లు పచ్చగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం కర్మ సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అశుభం జరుగుతుందని అంటారు. అయితే మకర సంక్రాంతి తర్వాత, శుభ కార్యక్రమాలకు మంచి ముహూర్తాలు మొదలై దేశ వ్యాప్తంగా పెళ్లి గంటలు మోగుతాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జనవరి 15, 2024 తర్వాత, వివాహానికి అనుకూలమైన సమయం 58 రోజులు మాత్రమే ఉన్నాయి. వివాహానికి అత్యంత అనుకూలమైన సమయం ఫిబ్రవరి, నవంబర్‌లలో ఉంది. మే, జూన్ మాసాల్లో బృహస్పతి అస్తమించడం వల్ల ఈ కాలంలో వివాహానికి అనుకూల సమయం కాదని పండితుల అభిప్రాయం. జూలై 16వ తేదీ నుంచి చాతుర్మాసం ప్రారంభమై నవంబర్ 12 వరకు కొనసాగుతుంది. చాతుర్మాస సమయంలో వివాహానికి శుభముహూర్తాలు ఉండవని అంటున్నారు. ఇక ఈ ఏడాదిలో ఏయే నెలల్లో ఏయే తేదీల్లో వివాహ ముహుర్తాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

జనవరి 2024 వివాహానికి శుభ ముహూర్తం 16 నుంచి ప్రారంభం కానుంది. జనవరిలో వివాహ తేదీలు - 16, 17, 20, 21, 22, 27, 28, 30, 31 తేదీల్లో వివాహాలు జరపవచ్చు.

ఫిబ్రవరి 2024 శుభముహూర్తాలు.. - 4, 6, 7, 8, 12, 13, 17, 24, 25, 26, 29.

మార్చి 2024 వివాహానికి అనుకూలమైన రోజులు - 1, 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12.

ఏప్రిల్ 2024 వివాహానికి అనుకూలమైన రోజులు - 18, 19, 20, 21, 22.

నవంబర్ 2024లో వివాహ తేదీలు - 12, 13, 16, 17, 18, 22, 23, 25, 26, 28, 29.

డిసెంబర్ 2024లో వివాహానికి అనుకూలమైన తేదీలు - 4, 5, 9, 10, 14, 15

డిసెంబర్ 16 నుంచి కర్మాలు ప్రారంభమవుతుండడంతో శుభకార్యాలకు నిషేధం.

జూలై నుంచి నవంబర్ వరకు చాతుర్మాసం కారణంగా వివాహాల పై నిషేధం ఉంటుంది.

Tags:    

Similar News