మార్నింగ్ వాక్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం తినాలో తెలుసా?

నడక ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే డాక్టర్లు సైతం ఎక్కువగా నడవాలని చెబుతుంటారు. ఇక మార్నింగ్ వాకింగ్ చేసే సమయంలో తప్పకుండా డైట్‌లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి.అయితే కొందరు తమకు

Update: 2024-04-13 04:07 GMT

దిశ, ఫీచర్స్ : నడక ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే డాక్టర్లు సైతం ఎక్కువగా నడవాలని చెబుతుంటారు. ఇక మార్నింగ్ వాకింగ్ చేసే సమయంలో తప్పకుండా డైట్‌లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి.అయితే కొందరు తమకు తెలియకుండా తీసుకునే కొన్ని ఆహారాలు అనారోగ్య సమస్యలను పెంచుతాయి. కాబట్టి మార్నింగ్ వాక్ చేసిన తర్వాత ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఉదయం డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. నడక నుంచి తిరిగి వచ్చిన తర్వాత బాదం, ఖర్జూర వాల్ నట్ వంటి మిశ్రమ గింజలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. అంతే కాకుండా ఇందులో ఉండే ప్రొటిన్స్, విటమిన్స్, ఫైబర్, శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. అలాగే మార్నింగ్ వాక్ తర్వాత ఉదయం మొలకలు తినడం ఆరోగ్యానికి మరీ మంచిదంటున్నారు వైద్యులు. దీని వలన ఈజీగా బరవు తగ్గడమే కాకుండా ఊబకాయం నుంచి బయటపడవచ్చును. ఇందులో ఉండే అధిక ఫైబర్ మీ పొట్టను ఆరోగ్యంగా ఉంచి , శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. వీటితో పాటు ఉదయం ఖాళీ కడుపుతో పండ్లను తినడం వల్ల మీకు తక్షణ శక్తి లభిస్తుంది. పండ్లు తినడం ద్వారా, విటమిన్లు A, C, K , E కాకుండా, శరీరానికి కాల్షియం, ఫోలేట్ , పొటాషియం వంటి ఖనిజాలు కూడా అందుతాయి. దీని వల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది. తగిన పోషకాహారాన్ని అందిస్తుంది.


Similar News