Mustard Seeds: ఆవాలతో ఏయే సమస్యలను తగ్గించుకోవచ్చో తెలుసా..?
మన భారతీయ వంటకాలలో ఆవాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

దిశ, వెబ్ డెస్క్ : మన భారతీయ వంటకాలలో ఆవాలను ( Mustard Seeds ) ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇవి చూడటానికి చాలా చాలా చిన్నగా ఉన్నా .. వీటి వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అంతే కాదు, దీనిలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అలాగే, ఇది మనల్ని అనేక సమస్యల నుంచి కాపాడుతుంది. ఆవాలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మాంగనీస్, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు కూడా దీనిలో ఉంటాయి. ప్రతి 100 గ్రాముల ఆవాలలో 9 నుంచి 82 గ్రాములు టోకోఫెరాల్ ఉంటుంది.
ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. మీరు, ఆవ నూనెను వంటల్లో ఉపయోగిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్స్ అంటున్నారు. పంటి నొప్పితో ఇబ్బంది పడేవారు.. గోరు వెచ్చటి నీటిలో ఆవాలు వేసి ఐదు నిముషాలు తర్వాత ఆ నీటిని పుక్కిలిస్తే పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. ఉబ్బసంతో బాధ పడేవారు, ఆవాల చక్కెర తో కలిపి తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. జుట్టు ఊడిపోయే వాళ్ళు.. ఆవాల పొడి తో మర్దన చేసుకుంటే జుట్టు రాలకుండా ఉంటుంది.
తేనె తో పాటు ఆవాల పొడిని తీసుకుంటే శ్వాసకోస సమస్యలు రాకుండా ఉంటుంది. కీళ్ల నొప్పులతో బాధ పడేవారు ఆవాల ముద్ద, కర్పూరం కలిపి నొప్పిగా ఉన్న చోట రాస్తే తగ్గుతుంది. ఆవాలలో సెలీనియం ఉంటుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ శరీరంలోని వ్యర్థమైన వాటిని బయటకు పంపిస్తుంది. అలాగే, కొవ్వును తగ్గించే గుణం కూడా దీనిలో ఉంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.