నవజాత శిశువును ముద్దు పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా..

నవజాత శిశువు పుట్టినప్పుడు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతో ఆనందిస్తారు.

Update: 2024-02-14 14:39 GMT

దిశ, ఫీచర్స్ : నవజాత శిశువు పుట్టినప్పుడు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతో ఆనందిస్తారు. చిన్నారి పాపను చూడగానే ప్రతి ఒక్కరూ శిశువు చిన్నచేతులను, మృదువైన చర్మాన్ని తాకి, లాలించాలని కోరుకుంటారు. బిడ్డను ఒడిలో పడుకోబెట్టుకుని, కౌగిలించుకోవడం, అతని నుదురు లేదా బుగ్గలు, చేతులను ముద్దాడటం, ఇవన్నీ ఏ ఇంట్లోనైనా సహజం. ఈ స్పర్శ ద్వారా పిల్లలు క్రమంగా ఇతరులతో మంచి అనుబంధాన్ని పెంచుకుంటారు.

పిల్లలను అందరు పాంపర్ చేస్తే వారు మానసికంగా దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది. పసిపిల్లలను ముద్దుపెట్టుకోవడం వలన ప్రేమించే సహజ గుణం వస్తుంది.

ఇది తల్లిదండ్రులు, పిల్లల మధ్య బాండింగ్ ని దృఢంగా చేస్తుంది. అయితే పిల్లలను ముద్దు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.

ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ..

పిల్లల నుదురు, చెంప పై ముద్దు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

శ్వాసకోశ వ్యాధులు వ్యాపిస్తాయని భయం..

పిల్లల ముఖం లేదా పెదాలను ముద్దు పెట్టడం వల్ల ఫ్లూ, శ్వాసకోశ వ్యాధులు వ్యాపిస్తాయని భయం ఉంది. చిన్న పిల్లలకు పూర్తిగా వేసి ఉండవు కాబట్టి వ్యాధుల సంక్రమణ ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

పెదవులలో ఇన్ఫెక్షన్ ఉండవచ్చు..

పిల్లల పెదాలను ముద్దు పెట్టుకోవడం పూర్తిగా నివారించాలి. ఎందుకంటే హెర్పెస్ వైరస్ మీ చర్మం పై ఉంటే, అది పిల్లలకి ఇన్ఫెక్షన్ కలిగించవచ్చు. ఈ వైరస్ పెదవుల పై, చుట్టుపక్కల చర్మం పై గాయాలను కలిగిస్తుంది. ఇది చాలా కాలం పాటు ఉండే స్కిన్ ఇన్ఫెక్షన్. నయం కావడానికి దాదాపు 15 నుండి 20 రోజులు పట్టవచ్చు. దీనిపై శ్రద్ధ చూపకపోతే, సమస్య ఎక్కువగా పెరుగుతుంది.

మీ నవజాత శిశువును అలాంటి వారి నుండి దూరంగా ఉంచాలి..

నవజాత శిశువును ప్రేమించాలి కాని చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఎవరైనా ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే లేదా దగ్గు, జలుబు, జ్వరం వంటి వైరల్ సమస్యలు ఉన్నట్లయితే చిన్న పిల్లలను వారికి దూరంగా ఉంచాలి. ఇది కాకుండా పిల్లలకు ఎప్పటికప్పుడు టీకాలు వేయాలి. దీంతో వారి శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తి పెరుగుతుంది.


Similar News