Vitamin D Deficiency : విటమిన్ డి లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా!
వ్యక్తిలో ఇది లోపిస్తే గనుక మెదడు పనితీరులో చురుకుదనం ఉండదు.
దిశ, ఫీచర్స్ : కండరాలు, ఎముకలు బలంగా ఉండేందుకు, శరీరానికి అవసరమైన కాల్షియం పొందేందుకు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండేందుకు విటమిన్ డి చాలా అవసరం. వ్యక్తిలో ఇది లోపిస్తే గనుక మెదడు పనితీరులో చురుకుదనం ఉండదు. ఇమ్యూనిటి పవర్ తగ్గుతుంది. వివిధ అనారోగ్యాలకు దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే విటమిన్ డి లోపాన్ని గుర్తించడం ముఖ్యం. కాగా దీన్ని ఎలా కనుగొనాలి? లక్షణాలు ఏంటి? చూద్దాం.
విటమిన్ డి లోపంవల్ల తరచూ నీరసంగా అనిపించడం, తీవ్రమైన అలసట, శారీరక బలహీనత, ఏ పని చేయలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఆలోచనా శక్తి తగ్గిపోవడం, తరచూ తలనొప్పి రావడం జరుగుతుంది. దీంతోపాటు చర్మంపై పగుళ్లు రావడం, ఎముకలు, కండరాల నొప్పి, తరచూ అనారోగ్యానికి గురికావడం వంటి ఇబ్బందులు కనిపిస్తుంటాయి. స్ట్రెస్, బరువు పెరగడం, నడుము నొప్పి, కండరాలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతుతాయి. ఇటువంటి లక్షణాలు గనుక మీలో గమనిస్తే విటమిన్ డి లోపించిందని సందేహించవచ్చు. వైద్య నిపుణులను సంప్రదించి నిర్ధారణ తర్వాత ఆ లోపాన్ని సరిచేసుకోవాలి. అయితే విటమిన్ డి సూర్యుడి నుంచి సహజంగానే లభిస్తుంది. ప్రతిరోజూ ఉదయంపూట లేత ఎండలో కాసేపు ఉండేలా చూసుకుంటే ఈ లోపాన్ని అధిగమించవచ్చు. అలాగే రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రొట్టెలు, చేపలు, రొయ్యలు, పన్నీర్, పాలు, పెరుగు, నెయ్యి, మష్రూమ్స్, బాదం, ఆరెంజ్, ఓట్స్, గోధుమ పిండితో చేసిన వంటకాలు తీసుకోవడంవల్ల విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు.
READ MORE