పిల్లల ముందు తల్లిదండ్రులు బట్టలు మార్చుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

చిన్న పిల్లల ముందు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా మెలగాలి అంటుంటారు. ఎందుకంటే పెద్దల నుంచే పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు. అయితే కొంత మంది పేరెంట్స్ తమకు తెలియకుండానే చిన్న పిల్లలే కదా అని వారి ముందే

Update: 2024-06-02 07:32 GMT

దిశ, ఫీచర్స్ : చిన్న పిల్లల ముందు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా మెలగాలి అంటుంటారు. ఎందుకంటే పెద్దల నుంచే పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు. అయితే కొంత మంది పేరెంట్స్ తమకు తెలియకుండానే చిన్న పిల్లలే కదా అని వారి ముందే బట్టలు మార్చుకుంటూ ఉంటారు. అయితే ఇది అస్సలే మంచిది కాదు అంటున్నారు నిపుణులు. దీని వలన చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంట.

పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వలన వారు కూడా దానినే అనుసరించడం ప్రారంభిస్తారు. అంటే ప్రైవేట్ ప్రాంతాల్లో బట్టలు మార్చుకోవడం, అందరి ముందు ఇష్టం వచ్చినట్లుగా మెదలడం లాంటిది చేస్తుంటారంట. ఒక వేళ మీరు గనుక వేరే రూమ్‌లోకి వెళ్లి బట్టలు మార్చుకుంటే వారి శరీరం గురించి వారికి అవగాహన వచ్చి, తమ శరీరాన్ని ఇతరులకు చూపించడకుండా ఉంటారు. వారిని వారు ప్రొటెక్ట్ చేసుకుంటారంట. అలాగే బట్టలు ఎక్కడ మార్చుకోవాలి. కొన్ని పనులు పబ్లిక్‌గా చేయకూడదు అని అర్థం చేసుకొని, పద్ధతిగా మెదులుతారంట.

అయితే కొన్నిసార్లు పెద్దలు తమ ముందే బట్టలు మార్చుకోవడం చూసిన పిల్లలు గందరగోలానికి గురి అవ్వడమే కాకుండా ఇబ్బందులకు లోను అవుతారంట. వారికి శరీరం గురించి అవగాహన లేక అసౌకర్యంగా ఫీల్ అవుతారు. అందువలన వారికి ప్రతి విషయాన్ని అర్థం అయ్యే విధంగా చెప్పాలి. అంతే కాకుండా బట్టు మార్చుకోవాలంటే ప్రైవేట్‌గా మార్చుకోవాలని, అందరి ముందు ఎప్పుడూ డ్రెస్ చేంజ్ చేసుకోకూడదు. మీ శరీరాన్ని మీరే గోప్యంగా ఉంచుకోవాలని చెప్పాలంట. దీని వలన వారు పెరిగే కొద్దీ పద్ధతిగా పెరుగుతారు.


Similar News