కాకి కావ్ కావ్ అని ఎందుకు అంటుంది.. అసలు దాని అర్థం ఏంటో తెలుసా?

కాకి అంటే అందరికీ తెలిసిందే. పురాణాల్లో కాకులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాకులకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కాకి ఇంటికి వచ్చిందంటే చాలు చనిపోయిన

Update: 2024-01-26 05:27 GMT

దిశ, ఫీచర్స్ : కాకి అంటే అందరికీ తెలిసిందే. పురాణాల్లో కాకులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాకులకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కాకి ఇంటికి వచ్చిందంటే చాలు చనిపోయిన తన కుటుంబీకులు వచ్చారని నమ్మి, భోజనం పెడుతుంటారు పెద్దలు. ఇక కాకులు పెంపుడు పక్షులు కాకున్నా, పెంపుడు వాటిలా ఇంటి పరిసరాల్లోనే తిరుగుతుంటాయి. ఉదయం లేచిందంటే చాలు కాకి అరుపులు వింటుంటాం. ఇంటి ముందు కాకి అరుస్తే చుట్టాలు రాబోతున్నారని మన పెద్దవారు అంటుంటారు.

ఇక కాకి కావు కావు అని అరుస్తూ ఉంటుంది. కాకి అరవడం చాలా మందికి చిరాకు కలిగిస్తుంది. కానీ అందులోనే వేదాంత బోధన ఉందటున్నాడు ఓ కవి.

కాకి అరుపులోని అర్థాన్ని పద్యరూపంలో చమత్కారంగా చెప్పాడు.."జీవితంలో ఏ క్షణాలూ సుస్థిరమైనవి కావు "అంతలోనే సమసిపోతాయి." సంపదలు, వాటివల్ల వచ్చే సుఖాలు స్థిరమైనవి కావు"అవి నశించిపోతాయి."మేడలు మిద్దెలు, అందాలు, ఐశ్వర్యాలు స్థిరమైనవి కావు"అవన్నీ కరిగిపోతాయి.దానికి ఉదాహరణ ఈ గోరీయే అని ఒక సుల్తాన్ గోరీమీద కూర్చుని కాకి అందరికీ బోధన చేస్తుందని చక్కగా కాకి అరుపును సమర్థించాడు. కాకి కూతను జీవిత సత్యాలను బోధిచిన విధానాన్ని పద్యరూపంలో చెప్పాడు.ఇలా కాకి కావు కావు అనే అరుపులకు అర్థాన్ని తెలియజేశాడు.

Tags:    

Similar News