అయోధ్యలో రాముడి విగ్రహం నల్లగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా?
కోట్లాది మంది హిందువులు కల నెరవేరింది. అయోధ్యలో బాల రాముడు కొలువుదీరాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో ఘనంగా రామ్ లల్లా(బాల రాముడు) విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేశారు. కోట్లాది మంది భక్తులు
దిశ, ఫీచర్స్ : కోట్లాది మంది హిందువులు కల నెరవేరింది. అయోధ్యలో బాల రాముడు కొలువుదీరాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో ఘనంగా రామ్ లల్లా(బాల రాముడు) విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేశారు. కోట్లాది మంది భక్తులు, ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే అయోధ్యలో ఉన్న బాల రాముడు నల్లటి రంగులో ఉంటారు. కాగా, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు రాముడి విగ్రహం నలుపు రంగులో ఎందుకు ఉంది. దీనికి ఏ మైనా కారణం ఉందా అని, దాని గురించే తెలుసుకుందాం.
తాజాగా రైజింగ్ భారత్ సమ్మిట్ జరిగింది. అందులో అయోధ్య రామమందిరానికి సంబంధించి ఎన్నో విషయాల గురించి చర్చించారు. ఈ క్రమంలోనే బాల రామయ్య విగ్రహం నల్లగా ఉండటానికి గల కారణాలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. రాముడి విగ్రహం కోసం మూడు విగ్రహాలు తయారు చేశాం. వీటిల్లో వైట్ స్టోన్,బ్లాక్ స్టోన్‌తో విగ్రహాలు రెడీ చేశారు. కానీ, నల్ల రాయితో చేసిన విగ్రహాన్నే ఎంపిక చేసుకున్నారు. ఏది ప్రతిష్ఠించాలనేది ట్రస్ట్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. కానీ ఆలయంలో ఏ విగ్రహం ఉండాలనేది, స్వయంగా రాముడే ఎంచుకున్నాడని నేను నమ్ముతున్నాం అంటూ చెప్పుకొచ్చారు.
Read More..