vegetarians : శాకాహారులు ఎక్కువగా ఉన్న దేశాలేవో తెలుసా !
ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువగా మాంసాహారాన్ని ఇష్టపడుతుంటారు.
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువగా మాంసాహారాన్ని ఇష్టపడుతుంటారు. మరి కొన్ని ప్రాంతాల్లో శాఖాహారాన్ని మాత్రమే ఇష్టపడతారు. అయితే కొంతమంది చిన్నప్పటి నుంచి నాన్ వెజిరేటిరయన్స్ అయినా మధ్యలో పూర్తిగా శాఖాహారులుగా మారిపోతుంటారు. మరికొంతమంది మాత్రం మధ్యలో నాన్ వెజ్ తినడం ప్రారంభించి తెగ కుమ్మేస్తుంటారు.
ఇదిలా ఉంటే ఇటీవలి కాలంలో చాలామంది ప్రజలు ఆరోగ్యం మీద శ్రద్దతో, లైఫ్ స్టైల్ చెయింజ్ లో భాగంగా వారి ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. దీంతో మాంసాహారులు కాస్త శాకాహారులుగా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని దేశాల్లో నాన్ వెజిటేరియన్స్ కంటే వెజిటేరియన్స్ సంఖ్య పెరిగిపోయింది. మరి శాఖాహారులు అతిగా ఉన్న మొదటి 5 దేశాలు ఏవో ఇప్పుడు చూసేద్దామా..!
భారతదేశం : భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాంసాహారం ఎక్కువగా తిన్నా మరికొన్ని ప్రాంతాల్లో శాకాహారం ఎక్కువగా తింటుంటారు. అయినా గణాంకాలను చూసుకుంటే శాకాహారం అత్యధికంగా తినేవారు ఉన్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. భారత్ లోని జనాభాలో దాదాపుగా 30 శాతం కన్నా ఎక్కువ మంది శాకాహారం మాత్రమే తింటారని చెబుతున్నారు. ముఖ్యంగా రాజస్థాన్, హర్యాన రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో శాకాహారులు ఉంటారని చెబుతున్నారు.
ఇజ్రాయెల్ : ఇక ఇజ్రాయెల్ విషయానికొస్తే దాదాపుగా 13 శాతం మంది జనాభా శాకాహారులే ఉన్నారట. ఇక్కడి ప్రజలు జంతుబలిని సమర్ధించరట.
తైవాన్ : ఇక తైవాన్ విషయానికి వస్తే 12 శాతం ప్రజలు శాకాహారాన్ని మాత్రమే తింటారట. దీంతో ఈ దేశం శాకాహార ప్రియలున్న దేశంగా మూడో స్థానంలో ఉంది.
ఇటలీ : శాకాహారం తినే ప్రజలు ఇటలీలో సుమారుగా 10 శాతం ఉన్నారట. దీంతో ఈ దేశంలో 4వ స్థానంలో నిలిచింది. నిజానికి నాన్ వెజ్ వంటకాలకు ఇటలీ ప్రసిద్ధి చెందింది. కానీ ఇటీవలి కాలంలో శాకాహారుల సంఖ్య పెరగుతుందని తాజా వెల్లడించిన నివేదికలు చెబుతున్నాయి.
ఆస్ట్రియా : ఇక ఆస్ట్రీయా దేశం విషయానికి వస్తే ఇక్కడ సుమారుగా 9 శాతం మంది ప్రజలు శాకాహారాన్ని మాత్రమే తింటారు. దీంతో ఆస్ట్రియా ఐదో స్థానంలో నిలిచింది.