కోల్డ్ షవర్‌తో ఎన్ని ప్రమోజనాలో తెలుసా..?
స్నానం చేయడం అనేది రోజు వారి దిన చర్య. దీని వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
దిశ, ఫీచర్స్: స్నానం చేయడం అనేది రోజు వారి దిన చర్య. దీని వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే.. చాలా మంది వేడి నీళ్ల స్నానానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. చల్లటి నీళ్లతో స్నానం అంటేనే భయపడిపోతారు. వాటి దగ్గరకు కూడా వెళ్లరు. పైగా.. ప్రస్తుతం శీతాకాలం కాబట్టి చల్లటి నీటిని చూస్తేనే ఒంటిలో ఒణుకు పుడుతుంది. అయితే.. కోల్డ్ షవర్ అనేది ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు చేకూర్చుతుందో తెలిస్తే మీరు చల్లటి వాటర్‌తోనే స్నానం చేసేందుకు ఇష్టపడతారు. మరి కోల్డ్ షవర్ కారణంగా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
1. చల్లటి నీళ్లతో రోజు స్నానం చెయ్యడం వల్ల విల్ పవర్ పెరుగుతుంది.
2. మీకు కంగారుగా, ఆత్రుతగా ఉందా. చల్లటి నీళ్లతో స్నానం చేస్తే ఒత్తిడిని తగ్గిస్తుంది.
3. కోల్డ్ షవర్ మీ చురుకుదనాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
4. అలాగే.. చర్మాన్ని, జుట్టును మెరుగుపరచడానికి ఉత్తమ మార్గాల్లో కోల్డ్ షవర్ ఒకటి.
5. అధిక బరువుతో బాధపడేవారు చల్లటి నీళ్లతో స్నానం చేసినట్లు అయితే.. కొవ్వు కరిగించి బరువు తగ్గడానికి ప్రేరేపిస్తుంది.
6. టెస్టోస్టెరాన్ అనేది పురుషులలో ప్రాథమిక సెక్స్ హార్మోన్. కోల్డ్ షవర్ పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది.
7. చల్లటి నీళ్ల స్నానం మీ స్పెర్మ కౌంట్‌ను పెంచి సంతానోత్పత్తిని వృద్ధి చేస్తుంది.
8. కోల్డ్ షవర్ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే.. కండరాల రికవరీని వేగవంతం చేస్తుంది.