వచ్చిన కష్టం ఎలా వెళ్తుందో తెలుసా..?
కొంతమంది చిన్న చిన్న సమస్యలనే చాలా కష్టంగా ఫీలవుతుంటారు.
దిశ, వెబ్ డెస్క్: కొంతమంది చిన్న చిన్న సమస్యలనే చాలా కష్టంగా ఫీలవుతుంటారు. ఇంట్లో తమ పిల్లలకు జ్వరం వచ్చినా తెగ టెన్షన్ పడిపోతుంటారు. వాతావరణ మార్పుల వలన కొన్ని వ్యాధులు రావడం సహజం దానికి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ ను కలిసి తగిన మందులు వాడితే రెండు రోజుల్లో నయం అవుతుంది.
బిజినెస్ లో లాభాలు, నష్టాలు సహజం. ఈ విషయంలో కూడా తమకు చాలా కష్టం వచ్చింది దేవుడా.. మమ్మల్ని ఈ కష్టాల్లో నుంచి బయటపడేయి అని చాలా మంది దేవుళ్లను వేడుకుంటారు. రకరకాల మొక్కులు మొక్కుతుంటారు. అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కష్టాలనేది ఆర్టీసీ బస్సుల లాంటివి. మనం బస్టాప్ లో నిలబడినప్పుడు రకరకాల బస్సులు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అలాగే మన జీవితంలో కూడా కష్టాలు వస్తూ, పోతూ ఉంటాయి. దానికి చింత చెందాల్సిన అవసరం లేదు.
Read More: విపరీతంగా గురక పెడుతున్నారా... మానాలంటే ఇలా చేయండి