పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ మీద ఉన్న పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సమయానికి వండుకుని తినడం అనేది చాలా తక్కువ. వంట కొంచెం ఆలస్యం కానీ పిల్లలు అల్లరి చేస్తూంటారు. ఇక అప్పుడు ఇంట్లో ఏమైనా స్నాక్స్ ఉన్నాయో చూస్తారు. స్నాక్స్ లేకపోయేసరికి పిల్లల గోల మాములుగా ఉండదు కదా మరి.
దిశ,వెబ్‌డెస్క్: ఈ బిజీ లైఫ్‌లో సమయానికి వండుకుని తినడం అనేది చాలా తక్కువ. వంట కొంచెం ఆలస్యం కానీ పిల్లలు అల్లరి చేస్తూంటారు. ఇక అప్పుడు ఇంట్లో ఏమైనా స్నాక్స్ ఉన్నాయో చూస్తారు. స్నాక్స్ లేకపోయేసరికి పిల్లల గోల మాములుగా ఉండదు కదా మరి. అమ్మా.. ఆకలేస్తోందమ్మా ఏదైనా ఉంటే పెట్టమ్మా అరుస్తారు. చిన్న పిల్లలకు బిస్కెట్స్ అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ఆ టైం లో పేరెంట్స్ పిల్లలకు రెండు రూపాయలు ఇచ్చి బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తినుపో అంటారు. ఒక్కసారిగా పిల్లాడు ఎగిరి గంతేసి థాంక్యూ మమ్మీ అని షాప్‌కి వెళ్తాడు. అంకుల్..రెండు రూపాయలకు బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వరా? అని అడుగుతాడు.
అప్పుడు రెండు రూపాయల పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాడు. ఎంతో బాగుందంటూ లొట్టలేసుకుంటూ తింటాడు. నిజమే పార్లే జీ బిస్కెట్ అంటే అందరూ ఇష్టపడతారు. తక్కువ ధరలో లభిస్తుంది. వివరాల్లోకి వెళితే..అసలు ఈ పార్లే జీ బిస్కెట్ ప్యాకేట్ కంపేని 1929 లో ప్రారంభించారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ బిస్కెట్లను వినియోగిస్తున్న కంపెనీగా రికార్డు సృష్టించింది. పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ బిస్కెట్ ప్యాకెట్ మీద ముద్దు ముద్దుగా , క్యూట్ గా ఉండే ఓ చిన్నారి బొమ్మ ఉంటుంది. ఆ చిన్నారి ఎవరో ఎవరికీ తెలియదు. నిజానికి చాలా మందికి బిస్కెట్ తింటున్నప్పుడు ఒక సందేహం వచ్చే ఉంటుంది. ఆ ప్యాకెట్ మీద క్యూట్ బేబీ ఎపరో అని, అసలు ఆమె ఇప్పుడు ఇలా ఉంది అని డౌట్స్ ఉంటాయి.
ప్యాకెట్ పై ఉండే అమ్మాయి పేరు నీరు దేశ్ పాండే. తనకు నాలుగేండ్ల వయసు ఉన్నప్పుడు తన ఫొటోను తీసుకొని పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ మీద వాడుతున్నారంట. ఇప్పటికీ అదే అమ్మాయి ఫోటోను వాడుతుండటం విశేషం. నీరు తండ్రి తీసిన ఫొటో.. పార్లేజీ బిస్కెట్ యాజమాన్యానికి నచ్చడంతో వాళ్లు అతని అనుమతి తీసుకుని పాప ఫొటోనే వాడుతున్నారంట. ఇప్పుడు అదే నీరు దేశ్ పాండే వయసు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. ప్రజెంట్ ఆమె వయసు 63 ఏండ్లు. కొంతమంది అసలు ఆ ఫోటోలో ఉన్నది అమ్మాయే కాదు.. కేవలం సృష్టించిన బొమ్మ మాత్రమే అని అంటుంటారు. కానీ.. నిజానికి ఆమె నీరూ దేశ్ పాండే అని చెబుతున్నారు. ఆ అమ్మాయే ఈమె అంటూ నీరు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.