భార్యాభర్తలు రోజులో ఎన్ని సార్లు ముద్దు పెట్టుకుంటే మంచిదో తెలుసా?

భార్య భర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి చూపుల తర్వాత నుంచి వారిలో మనం అనే భావన మొదలవుతుంది. మూడుముళ్ల‌తో ఒకటై, రెండు మనసులు ఒకటిగా ఉంటూ కష్టాల్లో,నష్టాల్లో పాలు

Update: 2024-03-23 10:26 GMT

దిశ, ఫీచర్స్ : భార్య భర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి చూపుల తర్వాత నుంచి వారిలో మనం అనే భావన మొదలవుతుంది. మూడుముళ్ల‌తో ఒకటై, రెండు మనసులు ఒకటిగా ఉంటూ కష్టాల్లో,నష్టాల్లో పాలు పంచుకొని చాలా సంతోషంగా ఉంటారు. ఇక వీరిద్దరూ సాన్నిహిత్యంగా ఉంటూ.. ఒకరికి ఒకరు తోడుగా, నీడగా ఉంటారు.

కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం అంటూ తమ పార్టనర్‌ని సరిగ్గా చూసుకోవడం లేదు. దీంతో భార్యభర్తలు సాన్నిహిత్యాన్ని కోల్పోతున్నారు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం జరుగుతుంది. భార్యభర్తలు ఇద్దరూ మంచిగా కలిసి ఉంటేనే ఏ బంధం అయినా బాగుటుంది. భార్యభర్తలు బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది. కానీ ఇప్పుడు భాగస్వాముల మధ్య కలహాలే ఎక్కువ అవుతున్నాయి. అయితే భార్యభర్తలు ఆనందంగా ఉండాలంటే. ప్రతి ఒక్కరూ భాగస్వామితో క్రమం తప్పకుండా శారీరక సాన్నిహిత్యం కలిగి ఉండటం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఇది ఇద్దరి మానసిక ప్రశాంతత పై ప్రభావం చూపిస్తుదంట. శారీరకంగా అంటే కేవలం సెక్స్ మాత్రమే కాదు, సాధారణంగా లాలించడం, కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం లాంటి రొమాన్స్ ఉండాలి. ప్రతి జంట రోజులో కనీసం మూడు లేదా ఐదు సార్లు ముద్దు పెట్టుకోవాలంట. అంతే కాకుండా ఆ ముద్దు తప్పనిసరిగా కనీసం ఆరు సెకన్ల పాటు పెట్టుకోవడం ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు.


Similar News