డీ హైడ్రేషన్‌ నుంచి తప్పించుకోవాలంటే రోజుకు ఎన్ని లీటర్ల వాటర్ తాగాలో తెలుసా..?

సాధారంగా మన శరీరంలో 65 శాతం వాటర్ కంటెంట్ ఉంటోంది.

Update: 2024-03-19 10:23 GMT

దిశ, ఫీచర్స్: సాధారంగా మన శరీరంలో 65 శాతం వాటర్ కంటెంట్ ఉంటోంది. అయితే వయస్సు రిత్యా నీటి పరిమాణంలో కూడా మార్పులు ఉంటాయి. మిడిల్ ఏజ్ వారిలో 65 శాతం నీరు ఉంటే.. వృద్ధుల్లో 50 శాతం, పిల్లల్లో 80 శాతం ఉంటుంది. ఈ నీరు శరీర ఆరోగ్యాన్ని కాపడటంతో పాటు.. అనేక వ్యాధులను దరి చేరకుండా చేస్తుంది. వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలను మూత్రం రూపంలో తొలగించడానికి సహాయపడుతుంది. ప్రజలందరూ తమ అవసరాన్ని బట్టి నీరు తాగాలి. అయితే కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడేవారు మాత్రం ఎక్కువగా నీరు త్రాగాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణలు. అయితే వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంది డీ హైడ్రేషన్‌కు గురవుతుంటారు. అలా జరుగకుండా ఉండాలంటే రోజుకు మినిమమ్ ఎన్ని లీటర్ల వాటర్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. పూర్తిగా సమ్మర్ సీజన్ రాకముందే సూర్యుడి వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక ఇప్పుడే ఇంత దారుణంగా ఉంటే.. రానున్న రోజుల్లో ఈ ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. దీంతో.. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే.. ఈ సీజన్‌లో ఎక్కువగా బాడీకి కూలింగ్ ఇచ్చే ఫుడ్, ఫ్రూట్స్ తీసుకోవాలి. అలాగే వాటర్ ఎక్కువగా తాగాలి. ఈ క్రమంలోనే ప్రజలందరూ హైడ్రేటెడ్‌గా ఉండటానికి రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు త్రాగాలి. వేసవి కాలంలో అయితే ఎప్పడూ తాగే వాటర్ కంటెంట్ కంటే ఎక్స్‌ట్రాగా 2.5 నుంచి 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. అంటే మినిమమ్ రోజుకు 5-6 లీటర్లు నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల మీరు హైడ్రేటెడ్‌గా ఉంటారు. దీని కారణంగా మీరు ఎండతీవ్రతను తట్టుకోగలుగారు. డీ హైడ్రేషన్‌ను నుంచి మిమ్మల్నీ మీరు రక్షించుకోగలుగుతారు.

Read More..

మీరు కొనే పుచ్చకాయ మంచిదేనా.. రంగు, రుచిని ఇలా గుర్తించండి?  


Similar News