జామ ఆకుల రసంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
అనేక పోషకాలతో కూడుకున్న జామపండ్లు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని అందరికీ తెలిసిందే
దిశ, వెబ్‌డెస్క్: అనేక పోషకాలతో కూడుకున్న జామపండ్లు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని అందరికీ తెలిసిందే. ఎన్నో వ్యాధులకు ఔషధంగా మేలు చేసే ఈ జామ పండు ఆకు రసంతో కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చెసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జామ ఆకులలో సల్ఫర్, సోడియం, ఐరన్, బొరాన్, క్యాల్షియం, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం లాంటి ఖనిజాలతో నిండి ఉంటుంది. తరచూ వీటిని తినడం వల్ల చక్కెర స్థాయిలను అదుపులో ఉంటాయి. జామ ఆకుల రసం జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. గ్యాస్, కడుపులో ఎలాంటి సమస్యలున్న ఈ రసాన్ని తాగడం వల్ల తగ్గిపోతాయి. ముఖ్యంగా డయాబెటిస్ పెషేంట్లకు చాలా మేలు చేస్తుంది. ఒకవేళ మీ దంతాలు నొప్పితో బాధ పెడుతున్నట్లయితే జామకులను లవంగాలతో కలిపి మెత్తగా మిక్స్ చేసి దంతాలపై అప్లై చేస్తే నొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఈ ఆకులో క్యాలరీలు చాలా తక్కువగా ఉండడంతో సిరలలోని చెడు కొలెస్ట్రాల్ పొట్టలోని కొవ్వును కరిగిగించడానికి అలాగే ఊబకాయం బారి నుంచి బయటపడేందుకు ఎంతో ఉపయోగపడుతుంది.
Read More: ఈ విషయం తెలిస్తే.. ఎండిపోయిన నిమ్మకాయలను అస్సలే బయటపడేయరు?