ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ఏటా ఇన్ని కోట్ల మంది మరణిస్తున్నారా ?

ఆహారంలో ఉప్పు లేకుండా అస్సలు తినలేము.. అలాగని ఉప్పు ఎక్కువ అయినా తినలేం.

Update: 2024-01-19 12:16 GMT

దిశ, ఫీచర్స్ : ఆహారంలో ఉప్పు లేకుండా అస్సలు తినలేము.. అలాగని ఉప్పు ఎక్కువ అయినా తినలేం. ఒకసారి వంటకాల్లో ఉప్పు ఎక్కువయితే దాన్ని వేరు చేయడం కూడా అసాధ్యమే. ఈ ఉప్పు గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని నమ్మలేని నిజాలను తెలిపింది. WHO నివేదికల ప్రకారం అధికంగా ఉప్పు వినియోగం వల్ల ప్రతి సంవత్సరం 1.89 మిలియన్ల మంది మరణిస్తున్నారని తెలిపింది. ఈ అలవాటు అధిక రక్తపోటు సమస్యను కలిగిస్తుందని దీంతో గుండె సంబంధిత సమస్యలు ఏర్పడతాయని వెల్లడించింది.

మనం రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే తినాలని WHO చెబుతుంది. అయినప్పటికీ కొంతమంది ఉప్పును అధికంగా తీసుకుంటారు. ఈ అలవాటు వల్ల శరీరంలో సోడియం ఎక్కువగా పెరిగి దాని వల్ల హైబీపీ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది క్రమంగా బ్రెయిన్ స్ట్రోక్‌కు దారితీస్తుందని చెబుతున్నారు. కేవలం ఆహారంలో మాత్రమే కాకుండా ఫాస్ట్ ఫుడ్, చిప్స్ లో మాత్రమే కాకుండా ఎన్నో ఆహార పదార్థాల ద్వారా ఇప్పును ఎక్కువగా తీసుకుంటున్నారని అంటున్నారు నిపుణులు.

ఈ విధంగా ఉప్పు తినడం తగ్గించండి..

మనం ఎప్పుడూ తాజాగా తయారు చేసిన ఆహారాన్ని తినాలని నిపుణులు చెబుతున్నారు. బయట తిండిని తినడం మానుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే బయటి ఫుడ్ లో ఉప్పు తక్కువ లేదా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

ప్రాసెస్డ్ ఫుడ్ లేదా ముందుగా ప్యాక్ చేసిన తినుబండారాలను తినడం మానేయాలి. ఎందుకంటే వాటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది.

Tags:    

Similar News