ఆకలిని పెంచే ఈ సూపర్ ఫుడ్ గురించి తెలుసా?

మన వంటగదిలో ఉండే మసాలా దినుసులు మనకి చాలా ప్రయోజనకరమైనవి.

Update: 2023-08-15 09:15 GMT

దిశ,వెబ్ డెస్క్: మన వంటగదిలో ఉండే మసాలా దినుసులు మనకి చాలా ప్రయోజనకరమైనవి. వాటిలో ఏలకులు చాలా ప్రత్యేకమైనవి. ఏలకులను ఆకుపచ్చ ఏలకులు అని కూడా పిలుస్తారు వీటిని ఎక్కువగా ఖీర్, బిర్యానీ లో వాడుతుంటాము. యాంటీఆక్సిడెంట్, యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఏలకులు వల్ల మన ఆరోగ్యానికి ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

ఆహారం తీసుకునే రెండు గంటల ముందు వీటిని తింటే ఆకలిని పెంచుతుంది. అంతే కాకుండా బరువు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. కొందరు దీన్ని "సూపర్ ఫుడ్" అని పిలుస్తారు. ఇవి కేలరీలను బర్న్ చేయగలదు అలాగే ఆకలి, ఆహార వినియోగాన్ని పెంచేటప్పుడు శరీర బరువును కూడా తగ్గించగలదు.

బరువు తగ్గడానికి ఏలకుల నీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఏలకుల నుంచి గింజలను తీసి ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఈ నీటిని ఉదయాన్నే లేవగానే తాగండి. మీరు నేరుగా యాలకుల పొడిని కూడా ఉపయోగించవచ్చు. బరువు తగ్గడానికి మీరు ఈ పానీయాన్ని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.  

Read More:   ప్లాస్టిక్ బ్యాగ్‌లను సబ్బుగా మార్చేయొచ్చు.. సింపుల్ టెక్నిక్‌తో.. 

Tags:    

Similar News