డాక్టర్లకే షాక్ ఇచ్చిన ఈ మొక్క గురించి తెలుసా?

ఈ ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి.

Update: 2023-07-11 05:13 GMT

దిశ, వెబ్ డెస్క్: ఈ ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. అవి మన చుట్టు పక్కలే ఉంటాయి.. కానీ మనం వాటిని పట్టించుకోకుండ ప్రతి చిన్న దానికి హాస్పిటల్ కు వెళ్తాము. మనం పిచ్చి మొక్కలు అనుకునే కొన్ని రకాల మొక్కలు మన ఆరోగ్యానికి పరిష్కారాలు. వాటిలో ఒకటి అతి బల మొక్క. ఈ మొక్క ఎటువంటి అనారోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా పని చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

పల్లెటూర్లలో రోడ్లకు ఇరువైపులా ఈ మొక్కలను చూస్తుంటాము. ప్రాంతాలను బట్టి ఈ మొక్కను వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ మొక్క మాల్వేసి కుటుంబానికి చెందినది. ద్వాపర యుగంలో దుర్యోధనుడును అతి బలవంతుడిగా చేయడానికి గాంధారి ఈ చెట్టును ఉపయోగించందని పురాణాలు చెబుతున్నాయి. ఈ చెట్టులో ఉన్న ఔషధ గుణాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం. దీని ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కీళ్ల నొప్పులతో బాధ పడే వారు ముద్ర బెండ ఆకులను వేడి చేసి కొంచెం వెన్న వేసి, నొప్పుల ఉన్న చోట కట్టు కడుతూ ఉంటే.. కీళ్ల నొప్పులు తగ్గి పోతాయి. అలాగే దీని ఆకుల పసరును ఆవ నూనెలో పోసి నూనె మిగిలే వరకు వేడి చేసి, భద్ర పరచుకొని నొప్పుల ఉన్న చోట పై పూతగా పూయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. అతి బల ఆకుల కషాయంలో చక్కెర కలిపి తాగుతుంటే గుండె దడ, ఆయాసం తగ్గుతుంది. చిగుళ్ల సమస్య , నోటి నుంచి దుర్వాసన సమస్య ఉన్న వారు ఆరు అతిబల ఆకులను శుభ్రముగా కడిగి రసము తీసి, ఆ రసముతో మూడు రోజుల పాటు పుక్కిట పడితే దంత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

గమనిక: పైన రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. దీనిని 'దిశ' ధృవీకరించట్లేదు 

Read More:  నిండా ముసుగేసి పడుకుంటున్నారా.. అంతమంచిది కాదంట? 


Similar News