కరెన్సీ నోటు.. నోటుకో చరిత్ర.. ఆ చిత్రాల వెనక రహస్యం ఇదే!

భారతదేశంలో మనం ఏ కరెన్సీ నోటును పరిశీలించినా బోసినవ్వుల గాంధీతాత చిత్రం కనిపిస్తుంది.

Update: 2023-06-30 14:12 GMT

దిశ, వెబ్ డెస్క్ : భారతదేశంలో మనం ఏ కరెన్సీ నోటును పరిశీలించినా బోసినవ్వుల గాంధీతాత చిత్రం కనిపిస్తుంది. అయితే వాటిలో కొన్ని నోట్లకు వేరేవేరు గుర్తులు కనిపిస్తాయి. అవి చారిత్రక కట్టడాలు కావొచ్చు లేదా స్మారక నిర్మాణాలు కూడా కావొచ్చు. అయితే వాటి చరిత్ర గురించి చాలా మందికి తెలిసి ఉండదు. మరి ఆర్బీఐ నోట్లపైన ముద్రించే ఆ చిహ్నాల గురించి వాటి చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..


1) మనం ఒక్కరూపాయి నోటును పరిశీలిస్తే దాని పై మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించిన చిత్రం ఉంటుంది. ప్రస్తుతం ఆ నోటు మనం చూద్దామన్నా కనిపించకుండా కనుమరుగైంది. ఎక్కడో కొంత మంది నోట్లు కలెక్షన్ చేసేవారి దగ్గర కనిపిస్తాయి.


2) పదిరూపాయల నోటును పరిశీలిస్తే దానిపై కోణార్క్ సూర్య దేవాలయాన్ని ముద్రించింది ఆర్బీఐ. ఈ నోటు 2018 జనవరి 5వ తేదీన ఆర్బీఐ విడుదల చేసింది. ఈ నోటు పై ముందువైపున గాంధీతాత చిత్రాన్ని, మరోవైపున 13వ శతాబ్దంలో నిర్మించిన కోనార్క్ సూర్యదేవాలయాన్ని ముద్రించింది. నరసింహదేవ-1 అనే రాజు ఈ సూర్యదేవాలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది. ఒడిశాలోని నిర్మించిన ఈ ఆలయం గోల్డెన్ ట్రయాంగిల్ దర్శనం ఇస్తుంది. అలాగే ఈ ఆలయం రథంలా ఉంటుంది. ఈ రథానికి 12 జతలు అంటే మొత్తం 24 చక్రాలు, ఏడు గుర్రాలు ఉంటాయి. ఈ రథం 24 గంటలను, ఏడు రోజులు, 12 నెలలను సూచిస్తుంది. 1984లో ఈ ఆలయం యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది.


3) 20 రూపాయల నోటును పరిశీలిస్తే దాని పై ఆర్బీఐ ఔరంగాబాద్ లోని ఎల్లోరా గుహలను ముద్రించింది. యునెస్కో ఈ ఎల్లోరా గుహలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఎల్లోరా గుహలు భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది. ఈ గుహలను 5వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్యలో నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది. వీటి నిర్మాణ కాలం క్రీ.పూ 600 నుంచి 1000 మధ్యలో ఉంటుంది. ఈ స్మారక నిర్మాణంలో బౌద్ధ, హిందూ, జైన కళాకృతులను భాగం చేశారు.


4) ఇక 50 రూపాయల కొత్త సిరీస్ నోటును పరిశీలిస్తే దానిపై ఫ్లోరోసెంట్ బ్లూ షేడ్ లో ఉంటుంది. ఈ నోటుపై కూడా రథం లాంటి చిత్రం కనిపిస్తుంది. ఈ ఆలయం కర్ణాటకలోని హంపీలోని విఠల ఆలయంలో ఉండే రథానికి సంబంధించిన చిత్రం. 14-16వ శతాబ్దం మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్య పాలనలో విఠల ఆలయ సముదాయాన్ని నిర్మించారు. ఇక ఈ ఆలయ సముదాయాన్ని యునెస్కో 1986లో ప్రపంచవారసత్వ సంపదగా గుర్తించింది.


5) వందరూపాయల నోటును చూస్తే గుజరాత్ లోని రాణికి వావ్ చిత్రం ఉంటుంది. ఈ కట్టడాన్ని సోలంకి రాణి ఉదయమతి 11వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర. రాణికి వావ్ కట్టడాన్ని కూడా 2014లో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ఈ కట్టడంలో అనేక శిల్పాలు చూపరులను కనువిందు చేస్తాయి.


6) ఇక కొత్తగా ఆర్బీఐ ముద్రించిన 200ల రూపాయల నోటును చూస్తే దానిపై మధ్యప్రదేశ్ లోని సాంచి స్తూపం బౌద్ధ స్మారక చిహ్నం కనిపిస్తుంది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో అశోక చక్రవర్తి ఈ స్తూపాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. 1989లో సాంచి స్తూపాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.


7) 500 రూపాయల నోటుమీద ఆర్బీఐ ఢిల్లీలోని ఎర్రకోటను ముద్రించింది. ఈ ఎర్రకోటను 17వ శతాబ్దంలో నిర్మించారు. ఎర్రకోటను మొదట 'ఖిలా-ఇ-ముబారక్' అని పిలిచేవారు. దీనిని మొఘల్ చక్రవర్తి పాలించారు. ఈ ఎర్రకోటను కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ సందపగా గుర్తించింది. ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోటపైన ప్రధానమంత్రి జెండా ఎగురవేస్తారు.


8) ఈ మధ్యకాలంలోనే మానిటైజ్ అయిన 2000వేల నోటు పై మంగళయాన్ చిత్రాన్ని ఆర్బీఐ ముద్రించింది. 2013లో ఇస్రో దీనిని రోదసీలోకి పంపించింది. భారతదేశ మొదటి ఇంటర్ ప్లానెటరీ స్పేస్ మిషన్ మంగళయాన్.

Tags:    

Similar News