సీజనల్ వ్యాధులు దరి చేరకుండా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే వీటిని తినాల్సిందే?

మిగతా సీజన్లతో పోల్చితే వర్షాకాలం అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి.

Update: 2024-08-20 09:36 GMT

దిశ, ఫీచర్స్: మిగతా సీజన్లతో పోల్చితే వర్షాకాలం అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల చల్లటి వాతావరణానికి చాలామందిలో దగ్గు, జలుబు, జ్వరం, తుమ్ములు వంటివి తలెత్తుతాయి. అయితే ఈ సమస్యల అందరిలో వచ్చినప్పటికీ కొంతమందిలో తీవ్రంగా ఉండి ఆరోగ్యంపై అధిక ప్రభావాన్ని చూపుతాయి. ఎన్ని చిట్కాలు పాటించినప్పటికీ తగ్గవు. దీంతో నానా హైరానా పడిపోతారు. అయితే సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే వీటిని తినాలని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తినడం వల్ల నారింజ, బత్తాయి, చెర్రీ, ఆల్ బుకరా, దానిమ్మ, బొప్పాయి, స్ట్రా బెర్రీస్, కివీ వంటివి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అలాగే సి విటమిన్ అధికంగా ఉండే.. నిమ్మరసంలో తేనె కలుపుకుని ఉదయం తాగడం వల్ల వ్యాధులు రాకుండా ఉంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలామంది అల్లం టీ తాగుతుంటారు. అయితే అల్లం టీ కంటే తినే ఆహార పదార్థాల్లో అల్లం, వెల్లులిని ఉపయోగించడం వల్ల ఇందులో యాంటీ వైరల్, బ్యాక్టీరియల్ లక్షణాలు వ్యాధులు దరిచేరకుండా ఆరోగ్యాన్ని కాపాడతాయి.

అన్ని కూరల్లో ఉపయోగించే టమాటోలో ఉండే లైకోపీన్ ఫ్రీరాడికల్స్‌తో పోరాడటంతో పాటు రోగాలు రాకుండా చేస్తాయి. వర్షాకాలం ఆకుకూరలు, క్యారెట్లు మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే చాలా మంది వర్షాకాలం పెరుగు తింటే దగ్గు, జలుబు వస్తాయని భావిస్తుంటారు. దీంతో పూర్తిగా పెరుగు దూరంగా ఉంటారు. అయితే పెరుగు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ అధికంగా తీసుకోకూడదని అంటున్నారు.

గమనిక: పైన అందించిన సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందించాము. దీనిని దిశ ధృవీకరించడం లేదు. ఏమైనా అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News