వేసవి కదా అని కూల్‌డ్రింక్‌లు తెగ తాగేస్తున్నారా? దయచేసి ఈ వీడియో చూడండి..!

ప్రస్తుత రోజుల్లో సీజన్ తో సంబంధం లేకుండా కూల్ డ్రింక్స్ తాగడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది.

Update: 2024-03-17 12:08 GMT

దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో సీజన్ తో సంబంధం లేకుండా కూల్ డ్రింక్స్ తాగడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ఒక్కసారి కూడా ఆలోచించకుండా పిల్లల నుంచి పెద్దల వరకు కూల్ డ్రింక్స్ తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతారు. పెళ్లి వేడుకల్లో, నలుగురు కలిసిన, పార్టీల్లోనూ కూల్ డ్రింక్స్ ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. మరికొందరైతే ఇంట్లో ఉండే ఫ్రిజ్ లలో స్టోర్ చేసుకుని మరీ నచ్చినప్పుడల్లా తాగుతుంటారు.

మరికొంతమంది ఫుడ్ తిన్నాక తప్పనిసరిగా శీతల పానీయాలు తాగితేనే డైజెస్ట్ అవుతుందనే స్థాయికి వచ్చేశారు. ఇక ఎండాకాలం వచ్చిందంటే చాలు ఇంకా ఎక్కువగా తాగుతుంటారు. కూల్ డ్రింక్స్ అమ్మకాలు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. హెల్త్ కు ఏ మాత్రం మంచిది కాదని తెలిసినా చాలా మంది పట్టించుకోరు. ఎన్నో అధ్యయనాల్లో కూల్ డ్రింక్స్ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని.. కొత్త సమస్యలను కొని తెచ్చుకున్నవారవుతారని నిపుణులు వెల్లడించారు.

తాజాగా కూల్ డ్రింక్ తయారీ విధానం గురించి ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. సాఫ్ట్‌డ్రింక్ క్యాన్స్ గురించి ఓ సీక్రెట్ బయటపడింది. బయటకు అది అల్యూమినియం క్యాన్ అయినా, లోపల ప్లాస్టిక్ లేయర్ ఉంటుందని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. learnwithadithya అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో పోషకాహార నిపుణుడు ఆదిత్య నటరాజ్ అల్యూమినియం క్యాన్‌ల సీక్రెట్ బయటపెట్టారు.

ముందుగా కోక్ టిన్ తీసుకుని స్యాండ్‌పేపర్‌తో క్యాన్‌ బయటి పెయింట్‌ను తొలగించాడు. తర్వాత క్యాన్‌లోని కూల్‌డ్రింక్‌ను గాజు గ్లాస్‌లో వేశాడు. అనంతరం అల్యూమినియం డబ్బాను ఆ కూల్‌డ్రింక్‌లో ముంచాడు. కాసేపయ్యాక అల్యూమినియం పూత కంప్లీట్ గా కరిగిపోయింది. ఆ డబ్బా పూర్తి పారదర్శకమైన ప్లాస్టిక్ కవర్‌గా చేంజ్ అవుతుంది. సాఫ్ట్‌డ్రింక్ క్యాన్‌లను అల్యూమినియం, సోడియం హైడ్రాక్సైడ్ తో తయారు చేస్తారు. ఈ సోడియం హైడ్రాక్సైడ్ ప్లాస్టిక్‌తో చర్య జరపదు.

ఎసిడిక్ నేచర్ కలిగి ఉండే డ్రింక్, అల్యూమినియం, సోడియం హైడ్రాక్సైడ్ మిశ్రమంతో రియాక్ట్ అవుతుంది. దాంతో ఆ డ్రింక్‌కు అల్యూమినియం లోహపు టేస్ట్ వస్తుంది. అలా జరగకుండా ఉండేందుకు మెటల్, డ్రింక్ మధ్య సన్నని ప్లాస్టిక్ పొరను ఉంచుతారు. ఈ విషయం సాఫ్ట్‌డ్రింక్స్ పరిశ్రమలో పని చేసే వారికి తెలుసు. బయట విపరీతంగా కూల్ డ్రింక్స్ తాగే వారికి మాత్రం తెలియదు. కాబట్టి ప్రజలు కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు.

Full View


Similar News