పిండికి పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
ఇంట్లో స్నాక్స్ చేసుకునే వారు శనగపిండి, జొన్న పిండి, గోధుమ పిండి, మైదా పిండి ఇలా అన్ని రకరకాల పిండి పదార్థాలను స్టోర్ చేసి పెట్టుకుంటారు.
దిశ, వెబ్‌డెస్క్ : ఇంట్లో స్నాక్స్ చేసుకునే వారు శనగపిండి, జొన్న పిండి, గోధుమ పిండి, మైదా పిండి ఇలా అన్ని రకరకాల పిండి పదార్థాలను స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఎక్కువ మొత్తంలో పిండిని స్టోర్ చేసిపెట్టుకున్నప్పుడు అందులో పురుగులు తయారైతే వృథాగా పడేస్తూ ఉంటారు. లేదా ఆ పిండిని శుభ్రం చేసుకుని వాడుకుంటాం. అయితే ఇలా పిండికి పురుగులు పట్టకుండా పిండిని వృథా చేయకుండా ఉండాలంటే కొన్ని టిప్స్‌ని ఫాలో అవ్వాలి. మరి ఆ టిప్స్ ఏంటో.. ఎలా ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పిండికి పురుగులు పట్టకుండా ఉండాలంటే పొడిపిండిని మంచి ఎండలో ఆరబెట్టాలి. అలా ఆరబెట్టినప్పుడు పిండిలో ఉన్న సన్నటి పురుగులు ఎండవేడికి బయటికొచ్చేస్తాయి. అలాగే పిండిని గాలి చొరబడని బ్యాగ్స్‌లో, కంటెయినర్లలో పెట్టి ఫ్రీజర్‌లో పెడితే పిండికి పురుగులు పట్టకుండా ఉంటుంది. ఫ్రీజర్ చల్లదనానికి అక్కడక్కడ ఉన్న సన్నని పురుగులు చనిపోతాయి. విడిగా ఉన్న పిండిలో కొన్ని లవంగాలు, బిర్యాణీ ఆకులను పెట్టి స్టోర్ చేస్తే ఆ సువాసనకు పురుగులు పట్టవు. అలాగే ఎక్కువ మొత్తంగా పిండిని కొనకుండా లిమిట్‌లో తీసుకుంటే మంచిది. పిండిని ఏ షెల్ప్‌లో పెడుతున్నామో ఆ షెల్ఫ్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి నీట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఈ టిఫ్స్ పాటిస్తే ఏ పిండి అయినా చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది.