తల్లిదండ్రులు పెట్టే శాపనార్థాలు పిల్లలకు తగులుతాయా?
కోపం అనేది చాలా కామన్. చాలా విషయాల్లో మన పెద్దవారు మనపై కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు, తమ పిల్లలు చేసే చిన్న చిన్న అల్లరి పనులకు విసిగిపోయి వారిపై అరిచేస్తుంటారు
దిశ, ఫీచర్ : కోపం అనేది చాలా కామన్. చాలా విషయాల్లో మన పెద్దవారు మనపై కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు, తమ పిల్లలు చేసే చిన్న చిన్న అల్లరి పనులకు విసిగిపోయి వారిపై అరిచేస్తుంటారు. అంతే కాకుండా వారిని శాపనార్థాలు పెట్టే మాటలు అంటారు. అయితే ఈ మాటలను కొందరు మైండ్‌కు తీసుకుంటారు.మా అమ్మ లేదా నాన్నకు నేను అంటే ఇష్టం లేదు అందుకే నన్ను శపిస్తున్నారు అనుకుంటారంట. మరి అసలు వారు పెట్టిన శాపనార్థాలు పిల్లలకు తగులుతాయా అంటే? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
కోపంలో తల్లిదండ్రులు పిల్లలను తిట్టడం, శపించడం సహజం. వారు అవి తమ పిల్లలకు అస్సలే తాకవు అనుకుంటారు పేరేంట్స్. కానీ తల్లిదండ్రులు పెట్టే శాపనార్థాలు పిల్లలకు తగులుతాయంట. కనిపెంచిన తల్లిదండ్రులు దైవంతో సమానం అంటారు. అందువలన వారి నోటి నుంచి వచ్చే మాటలు తప్పక ఫలిస్తాయంట. కడుపునపుట్టిన వాళ్లను కోపంలో ఏదో ఒకటి అనేస్తే, అది వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపెడుతుందంట. అందువలన వారిని ఏం అనకూడదంట. ఎంత కోపం ఉన్నప్పటికీ, నోటితో మాత్రం తిట్టడం, శపించడం లాంటివి చేయకూడదంటున్నారు పండితులు. ఇంకొంత మంది తండ్రి చనిపో అని తిట్టినా వారు ఆ మాటలను చాలా సీరియస్‌గా తీసుకుంటారంట. దీంతో నేను బతకడం మా ఫ్యామిలీకి ఇష్టం లేదని సూసైడ్ అటెమ్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందంట. అందువలన పిల్లలను మాటలు అనేముందు తల్లిదండ్రులు ఆలోచించాలి అంటున్నారు నిపుణులు.
Read More..