Lemon water: ఉదయం లేవగానే లెమన్ వాటర్ తాగుతున్నారా? వీరు తీసుకున్నారంటే అంతే సంగతంటున్నారు నిపుణులు

చాలా మంది వెయిట్ లాస్ అవ్వడానికో, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికో ప్రతి రోజు మార్నింగ్ నిమ్మరసం తాగుతుంటారు.

Update: 2024-08-17 04:29 GMT

దిశ, ఫీచర్స్: చాలా మంది వెయిట్ లాస్ అవ్వడానికో, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికో ప్రతి రోజు మార్నింగ్ నిమ్మరసం తాగుతుంటారు. ఈ నిమ్మరసం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని తరచూ ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉంటారు. కాగా రోజూ పరగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని లెమన్ వాటర్ తాగితే బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. అంతేకాకుండా రక్తహీనతను నివారించవచ్చు. హార్ట్ ప్రాబ్లమ్స్ దరిచేరకుండా ఉంటాయి. మొదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఊబకాయ సమస్య, బరువు సమస్యకు చెక్ పెట్టొచ్చు. నిమ్మరసం తాగడం వల్ల స్కిన్ వ్యాధులు కూడా తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. అయితే ఇన్ని ఉపయోగాలున్న ఈ నిమ్మరసం కొంతమంది మాత్రం తాగకూడదని తాజాగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

యాసిడ్ రిఫ్లక్స్ అండ్ అల్సర్ సమస్య..

యాసిడ్ రిఫ్లక్స్, అల్సర్ సమస్య ఉన్నవారు ఎట్టిపరిస్థితుల్లోనూ లెమన్ వాటర్ తీసుకోవద్దు. ఒకవేళ తీసుకున్నట్లైతే సమస్యను మరింతగా కొనితెచ్చుకున్నవాళ్లౌతరు. వీరు లెమన్ వాటర్ తీసుకుంటే జీర్ణక్రియకు సంబంధించిన ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అంతేకాకుండా గుండెలో మంట వస్తుంది. కాగా యాసిడ్ రిఫ్లక్స్, అల్సర్ సమస్యతో బాధపడుతోన్న వారు నిమ్మకాయకు దూరంగా ఉండటమే మేలని చెబుతున్నారు.

కిడ్ని స్టోన్ ప్రాబ్లమ్..

కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు నిమ్మకాయ రసం తాగొద్దని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. లెమన్ వంటి సిట్రస్ ఫ్రూట్స్ అండ్ పలు కూరగాయలకు కూడా దూరంగా ఉండమంటున్నారు. వీటిలో ఆక్సలేట్ ఉన్నందున మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుందట. అంతేకాకుండా కిడ్నీ స్టోన్స్ కు చికిత్స పొందిన వారు కూడా నిమ్మరసం తాగవద్దని, ఆక్సలేట్ అధికంగా ఉన్న ఫుడ్స్ ను తినవద్దని సూచిస్తున్నారు.

పంటి సమస్య, మాత్రలు వాడేవారు..

పంటి సమస్య ఉన్నవారు నిమ్మరసం తాగినట్లైతే మరిన్ని దంత సమస్యలు కొనితెచ్చుకున్నవారు అవుతారు. కొంతమందికి నిమ్మకాయ అలెర్జీ ఉంటుంది. కాగా లెమన్ వాటర్ తీసుకోవడం కారణంగా దద్దుర్లు వస్తాయి. దురద వస్తుంది. పెదవులు, నాలుక,గొంతులో వాపు రావడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే ప్రతి రోజూ మందులు వాడే వారు లెమన్ వాటర్ తాగితే వేసుకున్న మాత్రలపై ప్రభావం చూపిస్తుంది. మాత్రలు సరిగా జీర్ణం కావని నిపుణులు చెబుతున్నారు.

గమనిక : పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా తీసుకోబడింది నిర్ధారణలు, పర్యవసానాలకు ‘దిశ’ ఎలాంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే కనుక సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.

Tags:    

Similar News