మందు తాగేటప్పుడు నిజాలు మాట్లాడుతారంటారు.. ఇందులో నిజమెంత?

సాధారణంగా ఫ్రెండ్స్ మీట్ అయినా, వీకెండ్ వచ్చినా, ఇంటికి రిలేషన్స్ వచ్చినా మందు తాగుతారు.

Update: 2024-09-16 11:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఫ్రెండ్స్ మీట్ అయినా, వీకెండ్ వచ్చినా, ఇంటికి రిలేషన్స్ వచ్చినా మందు తాగుతారు. డ్రింక్ చేస్తూ చిల్ అవుతుంటారు. ఈ క్రమంలోనే వాళ్ల లైఫ్‌లో జరిగే విషయాలను చర్చించుకుంటారు. మంచి, చెడు మొత్తం ఓపెన్‌గా చెప్పుకుంటారు. మద్యం సేవించినప్పుడు భయం లేకుండా ప్రవర్తిస్తారు. కొంతమందికి ఎంత తాగినా ఎక్కదు. తాగినా తాగనట్లే కనిపించినా, మరికొంతమందైతే కొంచెం తాగగానే కింద పడిపోతారు. తరచూ వాగుతుంటారు. ఇతరులతో గొడవకు దిగుతారు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఓ టెన్షన్ నెలకొంటుంది. కాగా మందుబాబులు ఎందుకు ఆ సమయంలో అలా ప్రవర్తిస్తారు. తాగినప్పుడు నిజంగానే అన్ని విషయాలు ఓపెన్ అవుతారా? ఇందులో ఎంతవరకు నిజం ఉందో తాజాగా నిపుణులు దీనిపై క్లారిటీ ఇచ్చారు.

మందు తాగినప్పుడు జనాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతారు. గట్టిగా అరుస్తారు. తమదే పంతం నెగ్గాలనుకుంటారు. గొడవలకు దిగుతారు. కానీ మందు తాగితే నిజాలు కక్కుతారనేది ఏ మాత్రం నిజం కాదంటున్నారు నిపుణులు. దీన్ని శాస్త్రీయంగా నిరూపించలేదని వెల్లడించారు. డ్రింక్ చేసినప్పుడు ఒక వ్యక్తిపై ఏ విధంగా ప్రభావం చూపుతుందనేది వారి శరీర నిర్మాణం, మద్యం తాగిన పరిణామం, తమ మానసిక పరిస్థితిపై డిపెండ్ అయి ఉంటుందంటున్నారు నిపుణులు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Similar News