పాదాలు దుర్వాసన వస్తున్నాయా? కారణం ఇదేనట!

సాధారణంగా ఎవ్వరైనా సరే.. ఉద్యోగ రీత్యా, ఇతర పనుల మీద బయటకు వెళ్లినప్పుడు సాక్స్, షూస్ వేసుకుంటారు

Update: 2023-05-26 09:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఎవ్వరైనా సరే.. ఉద్యోగ రీత్యా, ఇతర పనుల మీద బయటకు వెళ్లినప్పుడు సాక్స్, షూస్ వేసుకుంటారు. తిరిగి ఇంటికి వచ్చాక షూస్ విప్పే సమయంలో మన పాదాలు స్మెల్ వస్తుంటాయి. చాలా మంది ఈ వాసన సాక్స్ నుంచే వస్తుందని భావిస్తారు. అయితే కొంతమంది శుభ్రమైన షూస్ ధరించినప్పటికీ కూడా వాసన వస్తూ ఉంటాయి. ఆ విధంగా దుర్వాసన రావడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

*  పాదాలు ఎక్కువగా స్వేద గ్రంథులను కలిగి ఉంటాయి.

* బాడీని చల్లబరచడానికి తరచూ చెమటలను విడుదల చేస్తూ ఉంటాయి.

* గర్భిణీ మహిళల్లో, యుక్త వయస్సులో ఉన్న వారిలో హార్మోన్లలో వచ్చే ఛేంజెస్ కారణంగా పాదాలు స్మెల్ వస్తాయి.

* దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు మందులు వాడుతున్న వారి పాదాలు మరింత ఎక్కువగా వాసన రావడం జరుగుతుంది.

నివారణ చిట్కాలు..

* పాదాలు వాసన రాకుండా ఉండాలంటే ఉదయం, సాయంత్రం సబ్బుతో చక్కగా క్లీన్‌గా చేయాలి.

* కాళ్ల వేళ్ల మధ్య తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే వేళ్ల మధ్య మురికి అలాగే ఉండి బ్యాక్టీరియా తయారవుతుంది.

* కాళ్లు క్లీన్ చేసిన అనంతరం ఖచ్చితంగా తడి లేకుండా తుడవాలి.

* కాళ్ల వేళ్లకు ఉన్న గోర్లను ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి.

* అలాగే తడిగా ఉండే సాక్స్‌లు, షూస్ అస్సలు వేసుకోకూడదు.

* షూస్ ధరించే ముందు పాదాలపై యాంటీ ఫంగల్ ఫౌడర్‌ను తప్పకుండా చల్లాలి.

* ఫీట్స్ వాసన రాకుండా ఉండాలంటే కొన్ని సులభమైన ఈ చిట్కాలు పాటించండి.

Read more :

ఆ టైమ్‌లో నిద్రలేచేవారే సంతోషంగా ఉంటారట.. ఎందుకో తెలుసా?

Tags:    

Similar News