రాత్రి సమయంలో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. దీనిలో నిజమెంత?
రావి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు
దిశ, ఫీచర్స్: రావి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి రావి చెట్టు పూజకు హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. పండుగల సమయంలో చాలా మంది రావి చెట్టు కింద పూజలు చేస్తారు. ప్రతి శనివారం రావి చెట్టు కింద కొందరు ఆవనూనె దీపం వెలిగిస్తారు. ఇది జీవితంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది.
అయితే రావి చెట్టును రాత్రి వేళల్లో దుష్టశక్తి వెంటాడుతుందని పెద్దలు చెబుతుంటారు.. అందుకే రావి చెట్టును రాత్రిపూట తాకకూడదని చెబుతారు. ఇది మూఢనమ్మకమా లేక ఇందులో శాస్త్రీయ కోణం ఉందనేది ఇక్కడ చూద్దాం..
రావి చెట్టును హిందూమతంలో దైవ స్వరూపంగా పరిగణిస్తారు. రావి చెట్టులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారు. చెట్టు వేరులో మహావిష్ణువు , కాండంలో కేశవుడు, ఆకుల్లో సకల దేవతలు నివసించారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే రావి చెట్టును పూజిస్తారు. అందుచేత సంప్రదాయాల ప్రకారం రాత్రిపూట రావి చెట్టు కిందకు వెళ్లడం, పడుకోవడం శ్రేయస్కరం కాదు.
రావి చెట్టులో ఆత్మలు ఉంటాయా?
పురాణ గ్రంథాల ప్రకారం, రావి చెట్టుపై నివసించే ఆత్మలు పూర్తిగా ఊహ మాత్రమే. గ్రంథాలలో రావి చెట్టును దేవతల మొక్కగా పరిగణిస్తారు. కావున రాత్రి పూట రావి చెట్టు దగ్గరకు రాకూడదు. ఇలా చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది. ఇలా చెప్తే మనుషులు రాత్రి పూట ఈ చెట్టు దగ్గరికి వెళ్లకుండా ఉంటారని చెబుతుంటారు. దీనిలో ఎలాంటి శాస్త్రీయ కోణం లేదు.