Teenagers: పిల్లలు ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడుతున్నారా?.. కారణం ఇదే కావచ్చు!
సహజంగానే పిల్లలు పిల్లలు బయట ఆడుకోవడానికి ఉత్సాహం చూపుతుంటారు. అయితే కొందర బయట అడుగు కూడా పెట్టరు. అలాగనీ తల్లిదండ్రులతో, ఇంట్లో ఉన్న ఇతర పిల్లలతో కూడా ఆడుకోవడానికి పెద్దగా ఇష్టపడరు.
దిశ, ఫీచర్స్: సహజంగానే పిల్లలు పిల్లలు బయట ఆడుకోవడానికి ఉత్సాహం చూపుతుంటారు. అయితే కొందర బయట అడుగు కూడా పెట్టరు. అలాగనీ తల్లిదండ్రులతో, ఇంట్లో ఉన్న ఇతర పిల్లలతో కూడా ఆడుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటప్పుడు పేరెంట్స్ పిల్లలను తిడుతుంటారు. బయట పిల్లలతో ఆడుకోకపోతే ఎలా? లోకజ్ఞానం ఎలా తెలుస్తుంది అంటుంటారు. అయితే అలా చేయకూడదు అంటున్నారు మానసిక నిపుణులు. ముందుగా వారు అలా ఎవరితో మాట్లాడకపోవడానికి, ఒంటరిగా ఉండటానికి గల కారణాలను తెలుసుకోవాలని చెప్తున్నారు. చైల్డ్ సైకాలజీ ప్రకారం.. పిల్లలు ఒంటరిగా ఉండేందుకు గల కారణాలేమిటో ఇప్పుడు చూద్దాం.
అవమానించేలా మాట్లాడటం
పిల్లలను అవమానించేలా మాట్లాడటమో, ఇతరులతో పోలుస్తూ తిట్టడమో చేస్తుంటారు కొందరు. ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్లినా.. ఈ రోజు ఎలాగో ఉత్సాహంగా ఉన్నావంటూ చులకన చేస్తుంటారు. నలుగురిలో ఉన్నప్పుడు పిల్లలు దగ్గరకు వస్తే ఎన్నడూ లేనిది అందరిలో కలిసేందుకు ధైర్యం చేశావంటూ నెగెటివ్ ఫీలింగ్‌తో అంటుంటారు. అయితే ఇలా చేయడం, వ్యంగ్యంగా మాట్లాడుతూ చులకన చేయడం, అవమానించడం టీనేజర్ల మనసును గాయపరుస్తుందని నిపుణులు చెప్తున్నారు. దీంతో పిల్లలు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు.
ప్రశ్నలు వేస్తూ విసిగించడం
టీనేజర్స్‌ను స్కూల్లో ఏం చేశావు. ఆ సమయంలో ఎందుకలా మాట్లాడావు. అలా కాకుండా ఇలా చేయాలి అంటూ తరచుగా ఏదో ఒకటి అంటూ ఉండటం వారికి నచ్చకపోవచ్చు. కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ఇలా అడుగుతూ విసుగు తెప్పించేలా ప్రశ్నలు వేయకూడదు. అలా చేస్తే పిల్లలు వీళ్లతో ఎప్పుడూ ఇదే సమస్య అని భావిస్తారు. ఒంటరిగా ఉండేందుకు ట్రై చేస్తారు. ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడరు. రూములో నుంచి బయటకు రాకూడదు అనుకుంటారు. కాబట్టి సమయం సందర్భం లేకుండా పిల్లలను కుటుంబ సభ్యులు లేదా పేరెంట్స్ ప్రశ్నలతో విసిగించడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు.
ప్రైవసీ ఇవ్వకపోవడం
పిల్లలకేం ప్రైవసీ ఉంటుందని ఎవరైనా అనుకుంటే పొరపాటే.. టీనేజర్స్ కూడా కొన్నిసందర్భాల్లో తాము ఒంటరిగా ఉండి డ్రాయంగ్ వేయాలనో, ఇంకేదో కొత్తగా ఆలోచించాలనో, గేమ్స్ ఆడుకోవాలనో అనుకుంటారు. కానీ అది చేయనివ్వకుండా తల్లిదండ్రులో, కుటుంబ సభ్యులో ఆ స్పేస్‌ను ఆక్రమించేస్తుంటారు. దీంతో వారు నిరాశకు గురికావచ్చు. కంటిన్యూ ఇదే కొనసాగితే పిల్లల్లో లోన్లీనెస్‌కు దారితీస్తుంది. కాబట్టి పిల్లల మనసును అర్థం చేసుకొని వారికి కూడా ప్రైవసీ ఉండేలా చూడాలంటున్నారు నిపుణులు. అలాగే తరచుగా ఏదో ఒక పనిచెప్తుండటం కూడా టేనేజర్స్‌లో నిరాశకు, ఒంటరి తనానికి కారణం కావచ్చు. కాబట్టి పేరెంట్స్ ఈ విషయాలను తెలిసి మసలు కోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే మానసిక నిపుణులను సంప్రదించగలరు.