కరోనా తర్వాత తగ్గిన విడాకులు, పెరిగిన వివాహాలు.. సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి!
కరోనా మహమ్మారి ప్రపంచాన్నే కుదిపేసింది. ఎంతో మంది జీవితాలలో చీకట్లు నింపింది. లాక్ డౌన్, కరోనాతో ఉద్యోగుల తొలిగింపులతో చాలా మంది తమ ఉపాధిని కోల్పోయారు.
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి ప్రపంచాన్నే కుదిపేసింది. ఎంతో మంది జీవితాలలో చీకట్లు నింపింది. లాక్ డౌన్, కరోనాతో ఉద్యోగుల తొలిగింపులతో చాలా మంది తమ ఉపాధిని కోల్పోయారు. ఇక లాక్ డౌన్ విధించడంతో ఎటు వెళ్లలేక ఇంట్లోనే ఉండిపోయారు. దీంతో భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, మనస్పర్థల కారణంగా చాలా మంది విడిపోయారు. అయితే తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆధ్వర్యంలో చేసిన నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టడీ స్టాటిస్టిక్స్ను తాజాగా విడుదల చేసింది.ఈ డేటా ప్రకారం కరోనా తర్వాత విడాకుల రేటు గణనీయంగా తగ్గి, పెళ్లిళ్ల రేటు పెరిగిందని చెబుతున్నాయి.
కరోనా తర్వాత 2022 నాటి ప్రతి వెయ్యి మందికి వివాహ రేటు 6.2శాతం పెరిగిందని తెలిపారు. దాదాపు 2 మిలియన్లకు పైగా వివాహాలు జరిగాయని చెబుతున్నారు పరిశోధకులు. అంతే కాకుండా సంబంధాలు చూసే తల్లిదండ్రులు కూడా, మంచి మంచి సంబంధాల కోసం వెతుకుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఇదే క్రమంలో కరోనా తర్వాత విడాకుల రేటు తగ్గుముఖం పట్టిదంట. కరోనా సమయంలో చాలా మంది విడాకులు తీసుకొని విడిపోయారు. కానీ మహమ్మారి తర్వాత అంటే 2022 లో విడాకుల రేటు తగ్గుముఖం పట్టింది. ప్రతి వెయ్యి మంది వ్యక్తులకు 2.4 విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపారు. 2021లో అయితే అది 2.3గా ఉందని,2022 కి అది స్వల్పంగా పెరిగిందని డేటా చెప్తోంది.