సెక్స్ లైఫ్‌కి మరింత కిక్ ఇచ్చే "ఛీ, పాడు" మాటలు.. ఎలాగంటే..?!

మీ అతిపెద్ద సెక్స్ ఆర్గాన్ రెండు చెవుల మధ్య ఉంటుంది. Dirty talking is one way to stimulated and aroused during sex.

Update: 2022-08-16 12:10 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః లైంగిక జీవితం మ‌ర‌పురానిదిగా ఉండ‌టానికి మార్గాలు అనేకం. అయితే, దానికి భాగ‌స్వాములిద్ద‌రూ స‌మ్మ‌తం ఉంటేనే ఆ సుఖం సంతోషంగా ఉంటుంది. అలాంటి మార్గాల్లో 'డర్టీ టాక్' కూడా మీ లైంగిక జీవితానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ అంటే ఏంటి? కేవలం జననేంద్రియ ఉద్దీపనో లేదంటే ఇంట‌ర్‌కోర్స్ మాత్ర‌మేనా..? అవి ముఖ్యమైనవే కానీ, మంచి లైంగిక జీవితాన్ని కలిగి ఉండటానికి ఇతర అంశాలు కూడా అంతే ముఖ్యమైనవని, సెక్స్యువాలిటీ కోచ్, సెక్స్-పాజిటివ్ ప్లాట్‌ఫారమ్ 'గెట్ ఇంటిమ‌సీ' వ్య‌వస్థాపకురాలు అయిన పల్లవి బర్న్వాల్ 'షి ది పీపుల్' వెబ్‌సైట్‌కు వెల్ల‌డించారు.

మంచి సెక్స్ అంటే కేవలం శ‌రీరానికి సంబంధించిన‌దే కాదు, ఇది లైంగిక శక్తితో పాటు దాని ఉత్సాహం స్థాయిని అనుభవించడం కూడా అంటారామె. ఇక‌, ఎంజాయ్‌మెంట్ విషయానికి వస్తే సెక్స్‌కు ముందు, సెక్స్ సమయంలో 'ఆన్' చేయడం చాలా ముఖ్యం. "మీ అతిపెద్ద సెక్స్ ఆర్గాన్ రెండు కాళ్ల మధ్య కాదు, రెండు చెవుల మధ్య ఉంటుంది అని నేను తరచుగా ప్రజలకు చెబుతాను. ముఖ్యంగా, మన మనస్సు దానికి "స్విచ్." ఇది పరిస్థితులు, భావోద్వేగాలు, అనేక ఇతర కారకాల ద్వారా ప్రేరేపించబడుతుంది లేదంటే ఆపేస్తుంది" అంటారు.

"డర్టీ టాక్" ఒక క‌ళ‌

సెక్స్ సమయంలో మీ భాగస్వామిని లేదంటే, మిమ్మల్ని మీరు ఉత్తేజపరచుకోడానికి, 'డర్టీ టాక్' ఒక మార్గం. ఇది మీ భావోద్వేగాన్ని మెరుగుపరుస్తుంది. భాగస్వామికి మరింత ద‌గ్గ‌ర‌గా, సాన్నిహిత్యాన్ని కోరుకునేలా చేస్తుంది. అయితే, 'లైంగిక భావాల‌ను బ‌హిరంగ ప‌ర‌చ‌డం త‌ప్పుగా భావించే తిరోగమన సమాజం' నుండి వచ్చిన, చాలా మంది భారతీయ జంటలు ఇలాంటి లైంగిక శక్తి వనరులను పొందడంలో విఫలమవుతున్నారని అంటారు ప‌ల్ల‌వి. ఇక‌, డర్టీ టాక్ విషయానికి వస్తే, భాగ‌స్వామి ద‌గ్గ‌ర మాట్లాడ‌టానికి కూడా చాలా మందిలో అలాంటి భయమే ఉంటుంది. నిజానికి, ఈ భయాలు మీ ఆలోచనల్ని, భావాలను స్వేచ్ఛ‌గా వ్యక్తపరచకుండా మిమ్మల్ని అడ్డుకుంటాయి. అలాగే, మిమ్మల్ని నిశ్శ‌బ్ధంలో బంధిస్తాయని ఆమె పేర్కొన్నారు.

నిజంగా, 'ఛీ, పాడు' మాటలు' అంత త‌ప్పే అయితే, ఫ్రెండ్స్ ద‌గ్గ‌ర‌, వారితో బహిరంగంగా చాలా సుల‌భంగా మాట్లాడుతుంటారు చాలా మంది. మ‌రి ఆ మాట‌ల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? తేడా ఏంటంటే, ఈ రెండు సంద‌ర్భాల్లో ఉన్న మ‌నుషుల‌ మధ్య మీకున్న‌ నమ్మకం, సౌకర్యం స్థాయి. అందుకే, మీ లైంగిక జీవితంలో 'డ‌ర్టీ టాక్‌'ను చేర్చాలనుకుంటే, మీ భాగస్వామికి, మీకూ మధ్య నమ్మకం, సౌకర్యాన్ని పెంపొందించుకోవాలి. అలా చేయడానికి ఉత్తమ మార్గం, ఇద్ద‌రి మ‌ధ్య‌ స్పష్టమైన కమ్యూనికేషన్ ఉండేట‌ట్లు చేసుకోవ‌డం. ఇక‌, మ‌రో ముఖ్య‌మైన విష‌యం, పడకగదిలో డర్టీ టాక్‌లో పాల్గొనాలనుకునే ముందు, ముందుగా భాగస్వామితో ఈ అంశం ప‌ట్ల త‌న‌కున్న అభిప్రాయం గురించి మాట్లాడమ‌ని ప‌ల్ల‌వి బ‌ర్న్వాల్ సూచిస్తున్నారు. 

48 మంది పిల్లలకు తండ్రి.. ఇంకా కొనసాగుతున్న వేట

నిన్ను అలా ఊహించుకోలేక పోతున్నాం.. అర్ధనగ్నంగా సీతారామం హీరోయిన్ 


Similar News