Digestive Power: జీర్ణ శక్తిని పెంచే ఔషధాలేంటోతెలుసా?

ఈ మధ్య కాలంలో బయట ఫుడ్స్ తినడం ఎక్కువైపోయింది .

Update: 2023-03-20 06:31 GMT

దిశ, వెబ్ డెస్క్ :  ఈ మధ్య కాలంలో బయట ఫుడ్స్ తినడం ఎక్కువైపోయింది . దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనిలో అందరిని బాగా ఇబ్బంది పెట్టేది జీర్ణ సమస్య. ఈ జీర్ణ శక్తి లోపిస్తే ఎన్నో రకాల వ్యాధులకు గురవుతాము. వయస్సు పై బడిలో వందలో సగానికి పైగా ఈ సమస్య వల్ల బాధ పడుతుంటారు. అలాంటి వారు వీటిని తీసుకుంటే వెంటనే ఉపశమనం పొందవచ్చు.

1. ఎండు ద్రాక్షలు , కిస్మిస్లు , తేనే , పంచదారను కలిపి బాగా మిక్స్ చేసి ఒక దానిలో నిల్వ చేసి ఉదయం, మధ్యాహ్నం , రాత్రికి ఇలా రోజులో మూడు సార్లు తీసుకుంటే అజీర్ణ సమస్యలు తగ్గుతాయి.

2. కరివే పాకు, కొత్తిమీర, పుదీనా , చింత చిగురు , తులసి ఆకులను తీసుకోవడం వలన జీర్ణ శక్తి పెరుగుతుంది.

3. శొంఠిని బాగా కాల్చి వాటిలో ధనియాలు, జీల కర్ర , మిరియాలు, తగినంత ఉప్పు కలిపి అన్నంలో మొదటి ముద్ద తినడం వలన జీర్ణ శక్తిని పెంచుతుంది.  

Also Read..

Fitness: మీరు బాడీ ఫిట్‌నెస్ కోరుకుంటున్నారా?.. అయితే డైలీ 2 మినిట్స్ వెనుకకు నడవండి! 

Tags:    

Similar News