మందిలో ఉన్నామని తుమ్మడం ఆపేస్తున్నారా? మెదడు, ఊపిరితిత్తుల అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే... దానికి బదులు ఇలా చేయండి..
ముక్కులో ఉండకూడని పదార్థాన్ని శరీరం గ్రహించినప్పుడు తుమ్ములు వస్తాయి. బ్యాక్టీరియా, పుప్పొడి, ధూళి ముక్కులోకి ప్రవేశిస్తే.. అసౌకర్యంగా అనిపించడం ప్రారంభమవుతుంది. కొద్దిసేపటి తర్వాత తుమ్ము వచ్చేస్తుంది.
దిశ, ఫీచర్స్ : ముక్కులో ఉండకూడని పదార్థాన్ని శరీరం గ్రహించినప్పుడు తుమ్ములు వస్తాయి. బ్యాక్టీరియా, పుప్పొడి, ధూళి ముక్కులోకి ప్రవేశిస్తే.. అసౌకర్యంగా అనిపించడం ప్రారంభమవుతుంది. కొద్దిసేపటి తర్వాత తుమ్ము వచ్చేస్తుంది. అయితే కొన్నిసార్లు తుమ్మకుండా అలాగే కంట్రోల్ చేస్తారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, మరొక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఇలా చేస్తుంటారు. కానీ ఈ పద్ధతి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
స్వల్పకాలిక ప్రమాదాలు:
1. తల, ముఖంలో ఒత్తిడి పెరుగుదల
2. సైనస్ నొప్పి
3. చెవిపై ఒత్తిడిని ప్రభావితం చేస్తుంది
4. తాత్కాలికంగా అస్పష్టమైన విజన్
5. ముఖం తిమ్మిరి రావడం
దీర్ఘకాలిక ప్రమాదాలు:
1. నాసికా కుహరంలో రంధ్రం
2. సైనస్ ఇన్ఫెక్షన్లు లేదా క్రానిక్ సైనసైటిస్
3. చెవి ఇన్ఫెక్షన్లు లేదా వినికిడి నష్టం
4. కండ్లకలక, పొడి కళ్ళు వంటి కంటి సమస్యలు
5. స్ట్రోక్ ప్రమాదం పెరగడం
అరుదైన తీవ్ర సమస్యలు:
1. న్యుమోథొరాక్స్ ( ఊపిరితిత్తులకు గాయం ఏర్పడటం.. హైపర్ టెన్షన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది)
2. న్యుమోమెడియాస్టినమ్ (ఛాతీలో ఎయిర్ లీక్)
3. కార్డియాక్ టాంపోనేడ్ (గుండె చుట్టూ ద్రవం చేరడం)
4. సెరిబ్రల్ అనూరిజం చీలిక (మెదడులో రక్తస్రావం)
తుమ్మకుండా ఎందుకు ఉండకూడదు?
తుమ్ము ఒత్తిడి 100 mphకి చేరుకుంటుంది. దాన్ని ఆపడం వల్ల ముఖం, తలలోకి తిరిగి ఆ ఒత్తిడిని బలవంతంగా తీసుకెళ్తాం. ఇది రక్త నాళాలు, సైనస్‌లు, చుట్టుపక్కల కణజాలాలకు హాని కలిగిస్తుంది. అలాంటి పరిస్థితి ఎదురవకుండా ఉండేందుకు సహజంగా తుమ్మడమే మంచిది. ఇబ్బంది అనుకుంటే నోరు, ముక్కును టిష్యూతో క్లోజ్ చేయమని సూచిస్తున్నారు నిపుణులు.