డయాబెటిస్‌ను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేసే ఆకులేంటో తెలుసా.. !

ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి.

Update: 2023-01-17 07:00 GMT

దిశ, ఫీచర్స్ : ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. షుగర్ ఉన్నవారు ప్రతిరోజూ మందులు వేసుకుంటేనే బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మందులతో పాటు పలు ఇతర ఆహారపు అలవాట్లు, ఆయుర్వేదిక్ చిట్కాలు కూడా మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. ముఖ్యంగా ఈ 5 రకాల ఆకులు కొన్నిరోజులపాటు తినడంవల్ల టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉంటాయి. ఆ ఆకులేమిటో, ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. 

పొడపత్రి ఆకులు

భారత దేశంలో అనేక రకాల ఆయుర్వేద మూలికలు, మొక్కలతో డయాబెటిస్ ను నియంత్రించే మార్గాలున్నాయని చెప్తుంటారు. ఇందులో భాగంగా టైప్-1, టైప్-2 డయాబెటిస్ పేషెంట్లకు పొడపత్రి ఆకుల రసాన్ని తాగాలని ఆయుర్వేదిక్ వైద్యులు సూచిస్తుంటారు. ఇవి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. 

తులసి ఆకులు

తులసి ఆకులు రోజు కొన్ని తినడంవల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఇవి ఎలా పనిచేస్తాయోనని 2019లో ఒక అధ్యయనం కూడా జరిగింది. తులసీ ఆకులు, వాటి రసం డయాబెటిస్ పేషెంట్లకు మేలు చేస్తాయని, షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయని అధ్యయన కర్తలు ఒక అంచనాకు వచ్చారు.

 

జైతూన్ ఆకులు

టైప్ 2 డయాబెటిస్ ముప్పును నివారించడంలో జైతూన్ ఆకులు తోడ్పడతాయి. ఒక ఆయుర్వేదిక్ రీసెర్చ్ ప్రకారం జైతూన్ ఆకులను వినియోగించడంవల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ మెరుగవుతున్నాయని తేలింది. కాబట్టి రోజూ వీలైనన్ని ఆకులను ఆహారంగా తీసుకోవడమో, వాటి రసాన్ని సేకరించి తాగడమో చేయడం బెటర్.



స్వీట్ తులసి (స్టేవియా)

అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం స్వీట్ తులసి లేదా స్టేవియా ఆకులు డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తాయి. 2018లో జరిగిన ఓ రీసెర్చ్‌ ప్రకారం ఇవి తరచూ తీసుకునే వారిలో డయాబెటిస్ క్రమంగా అదుపులోకి వచ్చినట్టు తేలింది. అందుకే నిపుణులు వీటిని సజెస్ చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి : ఫంగల్, స్కిన్ ఇన్ఫెక్షన్స్‌ నుంచి ఉపశమనానికి ఈ చిట్కాలు పాటిస్తే చాలు


టర్నిప్ ఆకులు

టర్నిప్ ఆకులు షుగర్స్ వ్యాధిని నిరోధిస్తాయి. వీటిలో ఫైబర్ శాతం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే ప్రతిరోజూ వీటిని తీసుకోవడంవల్ల మేలు జరుగుతుంది. టైప్ 1 డయాబెటిస్ పేషెంట్లు వీటిని తీసుకోవడంవల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లలో ఇన్సులిన్, లిపిడ్ స్థాయి మెరుగు పడతాయి. 

 



 



 


Tags:    

Similar News