Devils: దెయ్యాల దీవి.. అక్కడికి వెళ్లారో..!
ప్రపంచంలో ఎన్నో అందమైన, అద్భుతమైన దీవులు ఉన్నాయనే విషయం తెలిసిందే. కానీ అందంగా ఉండే దెయ్యాల దీవి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?..
దిశ, ఫీచర్స్ : ప్రపంచంలో ఎన్నో అందమైన, అద్భుతమైన దీవులు ఉన్నాయనే విషయం తెలిసిందే. కానీ అందంగా ఉండే దెయ్యాల దీవి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?.. పైగా అక్కడికి వెళ్తే దెయ్యాలు పడతాయని, చేతబడి చేస్తాయని కూడా కొందరు చెప్తుంటారు. అలాంటి బ్యూటిఫుల్ అండ్ ఫియర్‌నెస్ ప్లేస్ మరెక్కడో కాదు, ఇండోనేషియాలోని వరల్డ్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఏరియా అయిన బాలిలో ఉన్న నుసా పెనిడా దీవి.
సాధారణంగా టూరిస్టులు బాలిలోని పర్యాటక ప్రాంతమంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తారు. కానీ అక్కడి నుంచి ఒక గంట జర్నీ తర్వాత వచ్చే నుసా పెనిడా దీవిని మాత్రం దూరం నుంచే చూస్తుంటారు. ఎందుకంటే అక్కడ దెయ్యాలు ఉన్నాయని స్థానిక ప్రజలు నమ్ముతుంటారు. ఈ భయం కారణంగా ఆ ప్రాంతానికి వెళ్లడాన్ని స్థానిక అధికారులు కూడా నిషేధించారట. ఒక వేళ ఎవరైనా వెళ్తామంటే ఏదైనా జరిగితే తమకు సంబంధం లేదని చెప్తుంటారు. దీంతో దాదాపు ఎవరూ వెళ్లడానికి సాహసించరు.
భయానికి కారణం?
నుసా పెడా దీవిలో దెయ్యాలు, ఆత్మలు సంచరిస్తుంటాయనే ప్రచారమే దానికి దెయ్యాల దీవి అని పేరు వచ్చేందుకు కారణమని నిపుణులు చెప్తున్నారు. స్థానిక ప్రజల కథనం ప్రకారం.. ఒకప్పుడు ఆ దీవికి వెళ్లిన వారిలో ఒక అమ్మాయి స్కూబా డైవింగ్ చేస్తుండగా.. ఎవరో కాలు పట్టుకొని నీటిలోకి లాగుతున్నట్లు అనిపిచిందట. కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో ఏదో దెయ్యం పని అయి ఉటుందని నమ్మింది. అదే విషయాన్ని అక్కడి అధికారులకు, స్థానికులకు చెప్పడంతో అది పెద్ద రూమర్‌గా వ్యాప్తి చెందని నిపుణులు అంటున్నారు.
స్థానిక పురాణాల ప్రకారం..
స్థానిక పురాణాల ప్రకారం.. పురాతన కాలంలో నుసా పెనిడా దీవిలో జెరో గెడె మాకాలింగ్ అనే చేతబడి చేసే తాంత్రికుడు నివసించేవాడట. బాలి నుంచి వెలివేయడంతో అతను అక్కడికి వెళ్లి, అక్కడే ఉంటూ చనిపోయాక ఆత్మగా మారి సంచరిస్తున్నాడని నమ్ముతారు. అయితే ఇవన్నీ ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు మాత్రమేనని టూరిస్టు నిపుణులు, సైంటిస్టులు పేర్కొంటున్నారు. దెయ్యాల ప్రచారం, భయం కారణంగా సహజంగానే ప్రజలు అక్కడికి వెళ్లడం లేదు. కొందరు వెళ్లడానికి ఆసక్తి చూపినా భయంతో ఏదైనా జరగవచ్చనే ఉద్దేశంతో స్థానిక అధికారులు వద్దని చెప్తుంటారు.
దెయ్యాలు, ఆత్మలు నిజంగా ఉంటాయా?
సైన్స్ ప్రకారం.. దెయ్యాలు, భూతాలు, ఆత్మలు వంటివి ఉండవు. వాటిని సమర్థించేందుకు శాస్త్రీయ ఆధారాలు ఏవీ లేవని నిపుణులు చెప్తున్నారు. కాకపోతే కొందరిలో వాటిపట్ల నెలకొని ఉండే భయాలు, ప్రచారాలు, బలమైన నమ్మకాలు, మానసిక భ్రాంతిని కలిగిస్తుంటాయి. ఈ కారణంగా పారానార్మల్ యాక్టివిటీస్ ఏర్పడుతుంటాయి. నిజానికి ఇదో మానసిక రుగ్మత. దెయ్యం ఉందనే విషయాన్ని బలంగా నమ్మినప్పుడు వాస్తవాన్ని గ్రహించే ఆసక్తి, ఆలోచన తగ్గుతాయి. మైండ్ ఎక్కువగా భయం, భ్రాంతి లేదా భ్రమలపై డిపెండ్ అవుతుంది. దీంతో దెయ్యాలు లేకున్నా కొందరు ఉన్నట్లు ఊహించుకుంటారు. మనసులో నాటుకుపోయిన భయం కారణంగా అవి ఉన్నాయి అని చెప్పబడే ప్రదేశంలో ఉన్నప్పుడు ఏవైనా మెరుపులు, కదలికలు వంటివి కనిపించినా, వింత శబ్దాలు వినిపించినా నిజంగానే దెయ్యాలు అనే భ్రమకు లోనవుతుంటారు. కొన్ని నాడీ సంబంధిత రుగ్మతలు కూడా ఇందుకు కారణం కావచ్చు. అంతేకానీ దెయ్యాలు ఉండవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నుసా పెనిడా దీవి విషయంలో సరిగ్గా ఇదే జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.